ఈవీఎంల మొరాయింపు | Sakshi
Sakshi News home page

ఈవీఎంల మొరాయింపు

Published Tue, May 14 2024 3:30 PM

-

బడంగ్‌పేట్‌ పరిధిలో ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌

బడంగ్‌పేట్‌: పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా సోమవారం బడంగ్‌పేట మున్సిపాలిటీలోని 235, 237 పోలింగ్‌ బూతులను స్థానికంగా ఉన్న శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్‌ ప్రక్రియ ఈవీఎంలు మొరాయించడంతో రెండు చోట్ల 50 నిమిషాలు ఆలస్యంగా మొదలయ్యాయి. టెక్నీషియన్‌ వచ్చి మరమ్మతు చేసేవరకు ఓటర్లు క్యూలైన్‌లోనే పడిగాపులు కాశారు. అనంతరం వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలాపూర్‌ మండలంలోని అల్మాస్‌గూడ, బాలాపూర్‌, నాదర్‌గుల్‌, వెంకటాపూర్‌, మామిడిపల్లిలో పరిధిల్లోని పోలింగ్‌ బూత్‌ల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement