తుది జాబితాలో పెరిగిన ఓటర్లు | Sakshi
Sakshi News home page

తుది జాబితాలో పెరిగిన ఓటర్లు

Published Thu, Nov 9 2023 7:14 AM

-

రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. పేర్ల నమోదుకు చివరి అవకాశం ఇవ్వడంతో నియోజకవర్గ ఓటర్లు భారీగా స్పందించారు.

● కొత్తగా 25,575 మంది ఓటర్లుగా తమ పేర్లను ఓటరు లిస్టులో నమోదు చేయించుకున్నారు. దీంతో నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల సంఖ్య 5,77,937 మందికి చేరింది.

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో అధికం...

● రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని అత్తాపూర్‌, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌, సులేమాన్‌నగర్‌, శాసీ్త్రపురం డివిజన్‌లలో గతంలో 2,99,616 మంది ఓటర్లుగా నమోదయ్యారు. తుది జాబితాలో 13,831 మంది కొత్తగా చేరారు. దీంతో సర్కిల్‌ పరిధిలో ఓటర్ల సంఖ్య 3,13,447 మందికి చేరింది. సర్కిల్‌లోని 5 డివిజన్లలో దాదాపు 14 వేల కొత్త ఓటర్లు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల్లో వీరి ఓటు కీలకంగా మారనుంది.

మండలాల్లో పెరిగిన ఓటర్లు...

● నియోజకవర్గ పరిధిలోని గండిపేట్‌ మండలంలో 8,630 మంది తుది జాబితాలో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.

● మండల పరిఽధిలో మొత్తం 1,77,631 ఓటర్లుగా తుది జాబితాలో నమోదయ్యారు. శంషాబాద్‌ మండలంలో అత్యల్పంగా 3,114 మంది తుది జాబితాలో ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించారు. శంషాబాద్‌ మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 86,889కు చేరింది.

ఇతర ఓటర్ల సంఖ్య 44..

● నియోజకవర్గ పరిధిలో ఇతర ఓటర్లు 44 మందిగా నమోదయ్యారు. గతంలో 39 మంది ఉండగా తుది జాబితాలో ఇద్దరు పె రిగి, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 44 గా ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement