హోంగార్డ్‌ల పనితీరు ప్రశంసనీయం
సిరిసిల్ల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, విధినిర్వహణలో హోంగార్డుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ మైదానంలో శనివారం 63వ హోంగార్డు రైజింగ్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. హోంగార్డులు పోలీస్‌శాఖలో అంతర్భాగమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ బందోబస్తు విధుల్లో సమర్థంగా పనిచేస్తున్నారన్నారు. హోమ్‌గార్డ్స్ అధికారులు, సిబ్బంది ఎవరికి సమస్య వచ్చినా నేరుగా సంప్రదించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు కృష్ణ, మొగిలి, నాగేశ్వరరావు, రవి, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, రమేశ్ పాల్గొన్నారు.


