ఇళ్ల మధ్యే పర్మిట్ !
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని సినిమా థియేటర్ వద్ద కొత్తగా వచ్చిన వైన్స్ పర్మిట్‌రూమ్‌తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు హైదరాబాద్ ఎకై ్సజ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు వారు మాట్లాడుతూ థియేటర్ పక్క దారి నుంచి నడిచే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పర్మిట్‌రూమ్ ఎదుట వాహనాల పార్కింగ్‌తో రోడ్డు మూసుకుపోతుందన్నారు. పర్మిట్‌రూమ్‌లో మద్యం తాగి అక్కడే ఆరుబయట మూత్రవిసర్జన చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి ఆ ప్రాంతం నుంచి పర్మిట్‌రూమ్‌ను తొలగించాలని కోరుతున్నారు. దీనిపై ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన వైన్స్‌కు అనుమతులు ఇచ్చామన్నారు. పర్మిట్ రూమ్ వద్ద ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు.
మద్యం, నగదు రవాణా అరికట్టాలి
బోయినపల్లి: చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అక్రమంగా మద్యం, నగదు రవాణాను అరికట్టాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి సూచించారు. మండలంలోని నర్సింగాపూర్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.


