21న లోక్ అదాలత్
● జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత
సిరిసిల్లకల్చరల్: ఈనెల 21న జరిగే లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షురాలు బి.పుష్పలత కోరారు. సిరిసిల్ల కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చిన్నపాటి తగాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలతో కోర్టుల చుట్టూ తిరగొద్దన్నారు. సిరిసిల్ల, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జీలు పి.లక్ష్మణాచారి, అజయ్‌కుమార్‌జాదవ్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్‌పీ కె.నాగేంద్రచారి, మేజిస్ట్రేట్స్ ప్రవీణ్, జ్యోతిర్మయి, కావేటి సృజన, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చందుర్తి/రుద్రంగి/వేములవాడరూరల్: ఎన్నికల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రుద్రంగి, చందుర్తి మండలం మల్యాల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. రుద్రంగి తహసీల్ ఆఫీస్‌లో భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులపై ఆరా తీశారు. రుద్రంగి ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు. రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్, ఎంపీవో బండి ప్రదీప్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి నరేందర్ ఉన్నారు.
వెంటనే అన్‌లోడ్ చేయాలి
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన లారీల్లో నుంచి ధాన్యం బస్తాలను వెంటనే అన్‌లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని మహాలక్ష్మీ రైస్‌మిల్లును తనిఖీ చేశారు.
వేములవాడఅర్బన్/కోనరావుపేట(వేములవాడ): ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్ కోరారు. వేములవాడ మండలంలోని చీర్లవంచ, మారుపాక, చింతాల్‌ఠాణా, కోనరావుపేట మండలంలోని కొలనూర్, మర్తనపేటల్లోని పోలింగ్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఇంకా ఏమైనా వసతులు కల్పించాలా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో స్నిగ్ధ, అధికారులు ఉన్నారు.
వేములవాడ: మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌కు న్యాయవాదుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి పుష్పలత శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడేళ్ల సీనియార్టీ గల న్యాయవాదులు తమ ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 24లోపు వేములవాడ సబ్‌కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాజన్న గుడి వద్ద పటిష్ట భద్రత
రాజన్న గుడి పార్కింగ్ స్థలంలో తనిఖీ చేస్తున్న పోలీసులు
వేములవాడ: రాజన్న ఆలయ పరిసరాలు, గుడి చెరువు పార్కింగ్ ఏరియాలో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గుడి చెరువు ఖాళీ స్థలంలోని పార్కింగ్ ప్రదేశంలో డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
21న లోక్ అదాలత్
21న లోక్ అదాలత్
21న లోక్ అదాలత్


