సరిహద్దు చెక్‌పోస్టు తనిఖీ
గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా గంభీరావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామారెడ్డి, సిరిసిల్ల జిల్లా సరిహద్దు పెద్దమ్మ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సోమవారం తనిఖీ చేశారు. వాహనాల నమోదు రిజిస్టర్‌ను పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.


