గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు

Dec 2 2025 7:20 AM | Updated on Dec 2 2025 7:20 AM

గ్రీవ

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు

స్వచ్ఛహరిత పాఠశాలలకు ప్రశంసాపత్రాలు ఫేక్‌ కాల్స్‌తో జాగ్రత్త

సిరిసిల్ల క్రైం: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ వారం గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం 27 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిష్కరించాల్సిందిగా ఠాణాల అధికారులను ఆదేశించారు.

జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ అమలు

శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఈనెల 31 వరకు పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్‌ మీటింగులు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

సిరిసిల్లటౌన్‌: ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా పౌరులు బాధ్యతగా వ్యవహరించా లని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. ప్రపంచ ఎయిడ్స్‌ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అసురక్షిత లైంగిక చర్యలు, స్టెరిలైజ్‌ చేయని సిరంజీలను వాడడం, రక్తమార్పిడి ద్వారా హెచ్‌ఐవీ సోకుతుందని తెలిపారు. జిల్లాలో ఏప్రిల్‌ 25 నుంచి నవంబర్‌ 25 వరకు 2,521 మంది గర్భిణీలను పరీక్ష చేయగా ఒకరికి పాజిటివ్‌, అనుమానిత హెచ్‌ఐవీ 4,118 కేసుల్లో 26 మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. ఎన్జీవో ప్రెసిడెంట్‌ చింతోజు భాస్కర్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ అనిత, ఏవో శ్రీనివాస్‌, దేవిసింగ్‌, డిప్యూటీ డెమో రాజకుమార్‌, ఎయిడ్స్‌ కౌన్సెలర్‌ గంగయ్య పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: జిల్లాలోని స్వచ్ఛహరిత విద్యాలయాలుగా ఎంపికైన హెచ్‌ఎంలు, బాధ్యులను ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అభినందించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రాలు అందజేశారు. సర్వేలో అత్యధిక స్కోర్‌ పొందిన 8 పాఠశాలలు ఎంపికైనట్లు పేర్కొన్నారు. కేటగిరీ–1లో (1 నుంచి 8వ తరగతి) ఎంపీపీఎస్‌ నేరేళ్ల, మర్రిగడ్డ, సిరిసిల్ల–నెహ్రూనగర్‌, యూపీఎస్‌ పోతుగల్‌, కేటగిరీ–2లో(9 నుంచి 12వ తరగతి) జెడ్పీ హైస్కూళ్లు జిల్లెల్ల, వెల్జీపూర్‌, కేజీబీవీ ముస్తాబాద్‌, వేములవాడ వివేకానంద హైస్కూల్‌ ఎంపికయ్యాయి. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, డీఈవో వినోద్‌కుమార్‌, సతీశ్‌ పాల్గొన్నారు.

గుంటపల్లిచెరువు తండా ఏకగ్రీవం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని గుంటపల్లిచెరువుతండా సర్పంచ్‌ అభ్యర్థి ఏకగ్రీవమైనట్లు గ్రామస్తులు ప్రకటించారు. సోమవారం ఏకగ్రీవమైన సర్పంచ్‌ అభ్యర్థి తిరుపతినాయక్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉపసర్పంచ్‌గా గుగులోత్‌ మోహన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో బీఆర్‌ఎస్‌ ఖాతాలో తొలి ఏకగ్రీవం నమోదైంది. సింగిల్‌విండో చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కొండ రమేశ్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ పూణ్యానాయక్‌, నాయకులు పిల్లి కిషన్‌, ములిగె ప్రమోద్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

సిరిసిల్లటౌన్‌: పురపాలక సంఘం ఉద్యోగుల పేరుతో కొందరు సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందని సిరిసిల్ల మున్సి పల్‌ కమిషనర్‌ ఎంఏ ఖదీర్‌పాషా సోమవారం ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని కమర్షి యల్‌ షాపులలో ట్రేడ్‌లైసెన్స్‌ల పేరుతో వివిధ నంబర్ల నుంచి కాల్స్‌ చేస్తూ షాప్‌ యజమానుల నుంచి పన్నుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. షాపుల యజమానులు ఎవరూ అలాంటి కాల్స్‌కు స్పందించొద్దని కోరారు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారానే పన్నులు చెల్లించాలని సూచించారు.

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు1
1/1

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement