రెండో రోజు నామినేషన్ల జోరు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు సోమవారం ఊపందుకున్నాయి. తంగళ్లపల్లిలో తొలిరోజు సర్పంచ్‌కు 26, వార్డు సభ్యులకు 38 నామినేషన్లు రాగా.. సోమవారం సర్పంచ్‌కు 80, వార్డు సభ్యులకు 161 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని 11 నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో మొదటిరోజు సర్పంచుల కోసం 38, రెండో రోజు 67 మంది నామినేషన్లు వేశారు. వార్డుస్థానాలకు మొదటి రోజు 46, రెండో రోజు 235 నామినేషన్లు వేశారు. మొత్తంగా సర్పంచ్ కోసం 105, వార్డు స్థానాల కోసం 281 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో శశికళ తెలిపారు.
తప్పుడు ధ్రువపత్రాల నామినేషన్లు తొలగించాలి
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిమ్మపల్లిలో తప్పుడు కులధ్రువీకరణ పత్రాలతో సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీచేసిన వారి నామినేషన్లు రద్దు చేయాలని నిమ్మపల్లిలో గ్రామస్తులు సోమవారం నిరసన తెలిపారు. ఈ విషయమై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ నిమ్మపల్లిలో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించగా బీసీ వర్గానికి చెందిన మహిళ ఎస్సీ సర్టిఫికెట్‌తో వేసిన నామినేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మ ల్యాల మోజెస్, లింగంపల్లి శంకర్, గొర్రె శ్రీనివాస్, మల్యాల స్వప్న, గొర్రె జ్యోతి, లింగంపల్లి సుశీల, బందెల సదానందం, అంజవ్వ, దప్పుల సంతోష్, భాస్కర్, బందెల ప్రభాకర్, దప్పుల కాంతవ్వ, మల్యాల కీర్తన, దప్పుల శ్రీకాంత్, గొర్రె సుజాత, దప్పుల స్వామి, లింగంపల్లి జాన్ పాల్గొన్నారు.
భగవద్గీత శ్లోకాల పఠనంలో ప్రతిభ
ముస్తాబాద్(సిరిసిల్ల): భగవద్గీత శ్లోకాల పఠనంలో ఇద్దరు మహిళలు బంగారు పతకాలు సాధించారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన కటుకం లావణ్య, ఏనుగు జ్యోతి ఏడాదిపాటు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేశారు. తప్పులు లేకుండా లయబద్ధంగా ఆలపిస్తున్నారు. కర్నాటకలోని మైసూరు దత్తాశ్రమంలో భగవద్గీత శ్లోకాలపై నిర్వహించిన పోటీల్లో 700 శ్లోకాలు కంఠస్తంగా ఆలపించి బంగారు పతకాలు సాధించారు.
రెండో రోజు నామినేషన్ల జోరు
రెండో రోజు నామినేషన్ల జోరు


