‘ఎస్‌ఆర్‌’ విజయకేతనం | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఆర్‌’ విజయకేతనం

Published Sun, May 19 2024 7:45 AM

‘ఎస్‌ఆర్‌’ విజయకేతనం

తిమ్మాపూర్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కరీంనగర్‌ జిల్లా ఎస్‌ఆర్‌ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కరీంనగర్‌ ఎస్సార్‌ కళాశాల జోనల్‌ ఇన్‌చార్జి నేదూరి తిరుపతి తెలిపారు. తమ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ చదివిన తుమ్మ తేజస్వి 161 ర్యాంకు, ముంకల గణేశ్‌ 199, కటంకూరి శ్రీనివాసరెడ్డి 291, రావుల దీపాన్షురెడ్డి 412, గడ్డం రాజీవ్‌ 552, సాయిచంద్ర 565తోపాటు మరో 12 మంది వెయ్యి లోపు ర్యాంకులు, మరో 20 మంది 5వేల లోపు ర్యాంకులు సాధించారని వివరించారు. అగ్రికల్చర్‌లో మధులికరెడ్డి, లక్ష్మీప్రసన్న, అశ్విత రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులను సాధించారని తెలిపారు. విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్‌ వరదారెడ్డి, డైరెక్టర్‌ మధూకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, జోనల్‌ ఇన్‌చార్జి తిరుపతి, అకాడమిక్‌ డీన్‌ రవీందర్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు నాగార్జునరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, మారుతి, శ్రీనివాసరెడ్డి అభినందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement