ఈఏపీసెట్‌ ఫలితాల్లో ‘అల్ఫోర్స్‌’కు అత్యున్నత ర్యాంకులు | Sakshi
Sakshi News home page

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ‘అల్ఫోర్స్‌’కు అత్యున్నత ర్యాంకులు

Published Sun, May 19 2024 7:40 AM

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ‘అల్ఫోర్స్‌’కు అత్యున్నత ర్యాంకులు

కొత్తపల్లి(కరీంనగర్‌): ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌, ఫార్మసీ(ఈఏపీసెట్‌)–2024 ఫలితాల్లో కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ విద్యాసంస్థల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచి అద్భుత ర్యాంకులతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ టైనీటాట్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఈఏపీసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను బొకేలతో ఆయన సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వీఎన్‌ఆర్‌ మాట్లాడుతూ.. అల్ఫోర్స్‌కు చెందిన విద్యార్థులు వి.హాసిని 114వ ర్యాంకు, ఎన్‌.హేమంత్‌ 157, జి.శ్రీహాస్‌ 166, కె.సుప్రియ 296, ఎన్‌.జ్ఞానద 480, వి.శ్రీముఖి 568, ఎం.వర్షీత్‌ 575, జి.సాయిమంజునాథ్‌రెడ్డి 610, పి.జ్యోతిర్మయిరెడ్డి 863, శ్రీవెన్నెల 876, తేజస్విని 942, ఎ.శివవరుణ్‌ 973, సీహెచ్‌ అనూహ్య 950, పి.శ్రీనాథ్‌ 986, మలిహాఫాతిమా 992వ ర్యాంకు సాధించారన్నారు. 16 మంది విద్యార్థులు వెయ్యి లోపు ర్యాంకులు, 39 మంది 2వేల లోపు ర్యాంకులు, 63 మంది 3వేల లోపు ర్యాంకులు, 116 మంది 5వేల లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్‌ కీర్తిప్రతిష్టలను దశదిశలా చాటడం గర్వంగా ఉందన్నారు. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్‌కు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. ఇటీవల ప్రకటించబడిన ఐఐటీ మెయిన్స్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ చారిత్రాత్మక విజయం సాధించిందని, 450 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని చెప్పారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి ఫలితంగా అల్ఫోర్స్‌ ఘనవిజయాలు సాధిస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఐఐటీ అడ్వాన్స్‌, నీట్‌ ఫలితాల్లో మహోన్నత ర్యాంకులతో ముందంజలో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement