అత్యంత ఖరీదైన ప్రాంతం.. అక్కడ ఎకరా రూ.18 కోట్లు.. అంత విలువైన రెండెకరాల ప్రభుత్వ స్థలం సైకిల్‌ పార్టీ వశమైంది. సొంత పార్టీ కార్యాలయ నిర్మాణానికి చవగ్గా కట్టబెట్టేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సుమారు రూ.36 కోట్లున్న స్థలాన్ని సంవత్సరానికి కేవలం రూ.2 వేలకు లీ | - | Sakshi
Sakshi News home page

అత్యంత ఖరీదైన ప్రాంతం.. అక్కడ ఎకరా రూ.18 కోట్లు.. అంత విలువైన రెండెకరాల ప్రభుత్వ స్థలం సైకిల్‌ పార్టీ వశమైంది. సొంత పార్టీ కార్యాలయ నిర్మాణానికి చవగ్గా కట్టబెట్టేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సుమారు రూ.36 కోట్లున్న స్థలాన్ని సంవత్సరానికి కేవలం రూ.2 వేలకు లీ

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026 – 8లో.. సమీపంలోని ప్రైవేటు ఖాళీ స్థలానికి నెలకు రూ.25 వేలు... నిరుపేదకు 3 సెంట్లు ఇవ్వాలంటే వంద అడ్డంకులు...

న్యూస్‌రీల్‌

సైకిల్‌ పార్టీ కార్యాలయానికి విలువైన స్థలం అప్పగింత రూ.36 కోట్ల విలువైన స్థలం ఏడాదికి రూ.2 వేలకు లీజుకు భాగ్యనగర్లోని ఎకరా స్థలం రూ.18 కోట్లు 66 సంవత్సరాల లీజు పద్ధతిపై అప్పగించిన ప్రభుత్వం దానిని తిరిగి 66 సంవత్సరాలు, 99 సంవత్సరాలకు పెంచుకునేలా చర్యలు జీజీహెచ్‌ వెనుక, ఏసీబీ కార్యాలయం పక్కన పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ ఇదీ అధికార తెలుగుదేశం పార్టీ నిర్వాకం

శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026

టీడీపీకి కేటాయించిన స్థలానికి కూత వేటు దూరంలో ఉన్న ఎకరా స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకున్నారు. దానికి నెలకు రూ.25 వేలకు అద్దెకిచ్చారు. ఎకరాకు రూ.25 వేల చొప్పున రెండు ఎకరాలకు కలిపితే రూ.50 వేలు. ప్రైవేటు స్థలానికి నెలకు రూ.50 వేలు ఎక్కడ, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి కేటాయించిన స్థలానికి సంవత్సరానికి రూ.2 వేలు ఎక్కడా..? చంద్రబాబు అని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఒంగోలు నగరంలో గూడు కోసం నిరుపేద మూడు సెంట్ల స్థలం అడిగితే వంద నిబంధనలు పెడతారు. నగరంతో పాటు మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో సొంతింటి కల నెరువేర్చుకోవాలనుకున్న నిరుపేదలకు మూడు సెంట్ల స్థలం అందని ద్రాక్షేమరి. మున్సిపాలిటీల్లో, నగరపాలక సంస్థల్లో మూడు సెంట్లు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. కేవలం 2 సెంట్లు, లేకుంటే ఒకటిన్నర సెంటు మాత్రమే ఇవ్వగలమని అధికారులు, ఎమ్మెల్యేలు తెగేసి చెబుతారు. కానీ, సొంత రాజకీయ పార్టీ కార్యాలయానికి మాత్రం రూపాయికి, వెయ్యి రూపాయలకు ఎకరాల ఎకరాలు ఇచ్చేస్తారు. ఇదీ అధికార తెలుగుదేశం పార్టీ తీరు అంటూ.. అత్యంత తక్కువ లీజు ధరకు ప్రభుత్వ స్థలాన్ని ధారదత్తం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.1.32 లక్షలతో..

66 ఏళ్లు పచ్చగా!

Advertisement
 
Advertisement
Advertisement