
అండగా ఉంటాం..అధైర్యపడొద్దు
● కోర్టు వద్ద కార్యకర్తలను పరామర్శించిన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ, అన్నా రాంబాబు
పొదిలి: అక్రమ కేసుల్లో అరైస్టె రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలకు పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు భరోసా ఇచ్చారు. రిమాండ్‌లో ఉన్న పార్టీ కార్యకర్తలు వాయిదా రోజైన గురువారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు కార్యకర్తలను కలిసి ధైర్యం చెప్పారు. తప్పు చేయలేదని నిరూపించేంత వరకు పార్టీ లీగల్ టీం న్యాయ సేవలు అండగా ఉంటాయని చెప్పారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి పోరుబాట కార్యక్రమం ఊహించనంత విజయవంతం కావడంతో ఓర్వలేని కూటమి నేతలు అక్రమంగా అరెస్టులు చేయించి జైలుపాలు చేశారన్నారు. తప్పు చేయని కార్యకర్తలు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. పార్టీ కోసం మీరు చేసిన సేవలు గుర్తుంటాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, మాజీ వార్డు సభ్యులు షేక్.మస్తాన్‌వలి, ముల్లా జాకీర్, రియాజ్, అన్నవరం బ్రహ్మారెడ్డి, దోర్నాల చిన్న నారాయణరెడ్డి, శింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అండగా ఉంటాం..అధైర్యపడొద్దు