
సర్వం సాయి..
గురుపౌర్ణమి వేడుకలు జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. సాయిబాబా
ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
సాయినాథులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలులోని
సంతపేట, లాయర్‌పేట సాయి మందిరాలు కిటకిటలాడాయి. సామూహిక పూజలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భారీగా తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీల
ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
– సాక్షి, ఒంగోలు
వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా శివప్రసాద్
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా చావలి శివప్రసాద్‌ను నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించిన ఎస్‌ఈ
ఒంగోలు వన్‌టౌన్: నగరంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఆ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) కట్టా వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. ఇందిరాకాలనీ, పులివెంకటరెడ్డికాలనీలో లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా నూతనంగా ఏర్పాటు చేసిన 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను తనిఖీ చేశారు. అనంతరం ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి.శ్రీకాంత్, ఏఈఈ ఎంఎస్‌వీ రవిప్రకాష్ పాల్గొన్నారు.

సర్వం సాయి..