నాన్‌ బెయిలబుల్‌ కేసులో నిందితుడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

నాన్‌ బెయిలబుల్‌ కేసులో నిందితుడు అరెస్టు

Jul 10 2025 6:59 AM | Updated on Jul 10 2025 6:59 AM

నాన్‌

నాన్‌ బెయిలబుల్‌ కేసులో నిందితుడు అరెస్టు

టంగుటూరు: నాన్‌ బెయిలబుల్‌ కేసులో నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కారుమంచి గ్రామానికి చెందిన దోనంపూడి అచ్చమ్మకు భర్త దోనంపూడి రమేష్‌ మెయింటెనెన్స్‌ భరణం చెల్లించాలి. కానీ చెల్లించకపోవడంతో అచ్చమ్మ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయగా ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది అరెస్టు చేసి ఎకై ్సజ్‌ కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ నెల రోజుల జైలుశిక్ష విధించారు.

అక్రమ మద్యం విక్రేత అరెస్ట్‌

గిద్దలూరు రూరల్‌: మండలంలోని సంజీవరాయుడుపేట గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. స్థానిక ఎకై ్సజ్‌ శాఖ సీఐ ఎం.జయరావు తన సిబ్బందితో కలిసి గ్రామంలో సోదాలు నిర్వహించగా ఓ వ్యక్తి 10 మద్యం సీసాలతో పట్టుబడ్డాడు. తనిఖీల్లో సిబ్బంది శ్రీపతి, ఆర్షాదుల్లా, శంకర్‌, హరిబాబు పాల్గొన్నారు.

వక్ఫ్‌ భూముల్లో

ఆక్రమణల తొలగింపు

పొదిలి: వక్ఫ్‌ భూముల్లో ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగిస్తామని నగర పంచాయతీ కమిషనర్‌ నారాయణరెడ్డి పేర్కొన్నారు. షెడ్లు ఏర్పాటు చేసుకుని, వాస్తవంగా నివాసం ఉంటున్న వారికి ప్రత్యామ్నాయం చూపుతామని చెప్పారు. ఇదిలా ఉండగా ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకుడు మోహన్‌ధర్మా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. నోటీసులు ఇవ్వకుండా నివాసాలు తొలగించడం సరికాదని, పేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

రోగులకు మెరుగైన సేవలందించాలి

ఇన్‌చార్జి కలెక్టర్‌ గోపాలకృష్ణ

మద్దిపాడు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌ గోపాలకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవల వివరాలు, రోగుల రిజిష్టర్లు, రికార్డులు, క్యాజువాలిటీ రూం, అత్యవసర సేవా విభాగాన్ని, మెడిసిన్స్‌ భద్రపరుస్తున్న విధానాలను పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మూమోంట్‌ రిజిష్టర్‌, సిబ్బంది డ్యూటీ చార్ట్‌ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ప్రసవాలు చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్‌ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ వి.జ్యోతి, ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ శ్రావణ్‌, డాక్టర్‌ అన్వేష్‌, వైద్య శాఖ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

నాన్‌ బెయిలబుల్‌ కేసులో నిందితుడు అరెస్టు 1
1/1

నాన్‌ బెయిలబుల్‌ కేసులో నిందితుడు అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement