
మామిడికాయల లోడు వాహనం బోల్తా
మద్దిపాడు: మామిడికాయల లోడుతో వెళ్తున్న 407 వాహనం జాతీయ రహదారిపై మద్దిపాడు సమీపంలో బోల్తాపడింది. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల ప్రకారం.. చిత్తూరు నుంచి మామిడికాయల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న 407 వాహనం మద్దిపాడు సమీపంలోకి వచ్చేసరికి ముందు టైరు పేలిపోయి అదుపుతప్పి తిరగబడింది. వాహనంలోని మామిడి కాయలు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. సమాచారం అందుకున్న మద్దిపాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ గుమిగూడిన ప్రజలను అదుపుచేశారు. వాహనం నడుపుతున్న వ్యక్తికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.