నేడు ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

నేడు ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Jul 8 2025 4:29 AM | Updated on Jul 8 2025 4:29 AM

నేడు ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

నేడు ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఒంగోలు సిటీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు పాల్గొననున్నటు తెలిపారు. అన్ని నియోజకవర్గాల యూత్‌ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

యూనివర్సిటీకి

ప్రత్యేక గుర్తింపు తెస్తాం

నూతనంగా విధుల్లో చేరిన పలువురు అడ్మిన్లు

ఒంగోలు సిటీ: విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఏకేయూలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కళాశాలల అభివృద్ధి మండలి (సీడీసీ)డీన్‌ డాక్టర్‌ కే.వి.ఎన్‌.రాజు, నూతనంగా ఏకేయూ పరీక్షల నియంత్రణ అధికారి (సి.ఈ)గా విధుల్లో చేరిన ప్రొఫెసర్‌ జి.సోమశేఖర్‌ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో వారి నూతన విభాగాల్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరికి యూనివర్సిటీకి చెందిన సహచర అధ్యాపకులు, సిబ్బంది, పలు కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

‘అక్షర ఆంధ్ర’ ను విజయవంతం చేయాలి

సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ

ఒంగోలు సబర్బన్‌: నిరక్షరాస్యులైన వయోజనులను కూడా అక్షరాస్యులుగా మార్చే ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ ఆదేశించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో నిర్వహించారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఉల్లాస్‌’ పథకంలో భాగంగా 2025–26 విద్యా సంవత్సరంలో ‘అక్షర ఆంధ్ర’ అనే ప్రత్యేక సాక్షరతా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జగన్‌ మోహన్‌రావు ఈ సందర్భంగా వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 1,29,497 మందిని అక్షరాస్యులుగా చేయాల్సి ఉందన్నారు. ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బోధన ప్రారంభమయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించినందున, దీనికి సంబంధించిన వాలంటీర్‌ టీచర్ల గుర్తింపు, శిక్షణ కార్యక్రమాలను ప్రణాళిక మేరకు ఈ నెలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, డీఈవో కిరణ్‌ కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement