వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర విజయవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర విజయవంతం చేయాలి

Published Sat, Nov 18 2023 1:52 AM

సమావేశం నిర్వహిస్తున్న అధికారి రామచంద్రుడు, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌   - Sakshi

కేంద్ర ప్రభుత్వ జిల్లా ఇన్‌చార్జ్‌ అధికారి రామచంద్రుడు

ఒంగోలు అర్బన్‌: ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు జిల్లాలో చేపట్టే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వంచే జిల్లా ఇన్‌చార్జ్‌ అధికారిగా నియమితులైన కేంద్ర సెన్సస్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ ఎం రామచంద్రడు జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌తో కలిసి కార్యక్రమంపై జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మొదటిగా ఈ సంకల్ప యాత్రకు నోడల్‌ అధికారిగా ఉన్న జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ జిల్లా ఇన్‌చార్జ్‌ అధికారి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల సంక్షేమ పథకాలను సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సరిగా వినియోగించుకుంటున్నారో లేదో పరిశీలించాలన్నారు. పథకాలు పొందిన వారి విజయగాథలు వివరిస్తూ డాక్యుమెంటేషన్‌ చేయాలని సూచించారు. రెండు నెలలపాటు జరగే కార్యక్రమానికి జిల్లాకు ఏడు వాహనాలను కేటాయిస్తారని, కేటాయించిన గ్రామాలన్నీ తిరిగి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రచారం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ యాత్ర కార్యక్రమాన్ని జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో 40 మందితో, మండల స్థాయిలో ఐదుగురు, పట్టణ స్థాయిలో ఐదుగురు, గ్రామ స్థాయిలో 15 మందితో కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో ఐదుగురు సభ్యులతో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ రవికుమార్‌, డీఎస్‌ఓ ఉదయభాస్కర్‌, పశుసంవర్ధక శాఖ అధికారి బేబిరాణి, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్‌, బీసీ సంక్షేమ అధికారి అంజల, డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి, వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఎల్‌డీఎం అబ్దుల్‌ రహీం, జెడ్పీ డీఈఓ సుబ్బారావు, సచివాలయ నోడల్‌ అధికారి ఉషారాణి, ఏఎస్‌పీ అశోక్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement