ఇద్దరు ఎస్సైల బదిలీ | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎస్సైల బదిలీ

Published Sat, Nov 18 2023 1:52 AM

అర్జీలు స్వీకరిస్తున్న జేసీ కె.శ్రీనివాసులు    - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ మలికాగర్గ్‌

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ మలికాగర్గ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఒంగోలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌.సుబ్బారావును ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు, అదే తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న జి.ప్రభాకర రెడ్డిని ఒంగోలు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేస్తూ అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దనీ ఒంగోలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ నుంచి రిలీవ్‌ చేసి బదిలీ అయిన పోలీస్‌ స్టేషన్‌లలో జాయిన్‌ చేసుకోవాలని ఒంగోలు డీఎస్పీ వి.నారాయణ స్వామి రెడ్డిని ఎస్పీ ఆదేశించారు.

స్పందనతో ప్రజాసమస్యల పరిష్కారం

జేసీ శ్రీనివాసులు

కంభం: గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండలాల వారీగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. స్థానిక యూబీ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌, స్పందన సూపర్‌వైజర్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామసుబ్బులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 263 మంది అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు. అర్జీలు పరిశీలించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హజరత్‌ గూడెం పంచాయతీ పరిధిలో సుమారు 2500 మందికి పైగా జనాభా ఉన్నారని, ప్రత్యేకంగా సచివాలయం ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ మహబూబ్‌ పీరా అర్జీ సమర్పించారు. అదే విధంగా గ్రామంలో ఎస్టీ వలంటీర్‌ పోస్టుకు మూడు సంవత్సరాల నుంచి ఎవరూ ముందుకు రాలేదని, రిజర్వేషన్‌ మార్చాలని, పంచాయతీ పరిధిలోని అర్బన్‌ ఏరియాలో చెత్తసేకరణకు ట్రాక్టర్‌ మంజూరు చేయాలని ఆయన వినతి పత్రం అందజేశారు. కంభానికి చెందిన రైతు రమేష్‌ బేస్తవారిపేట మండలంలోని నేకునాంబాద్‌ ఇలాఖాలో ఉన్న తనపొలం ఆక్రమణకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఎద్దులబండిపై ఫ్లెక్సీలో అధికారుల పేర్లు వేసి నిరసన తెలిపాడు. ఎంపీపీ చేగిరెడ్డి తులశమ్మ, హజరత్‌గూడెం సర్పంచ్‌ మహబూబ్‌పీరా అధికారులను సన్మానించారు.

రోడ్ల నిర్మాణానికి రూ.6.33 కోట్లు మంజూరు

మార్కాపురం: నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు. పొదిలి మండలం ఉన్నగురువాయపాలెం నుంచి వెలిగండ్ల వయా కుంచేపల్లి, గొల్లపల్లి, ఈగలపాడు వరకు రోడ్డు నిర్మాణానికి రూ.6.33 కోట్లు మంజూరు చేస్తూ జీఓ నంబర్‌ 788ని విడుదలైందని ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 12.22 కి.మీ పొడవున రోడ్డు నిర్మిస్తారని అన్నారు. ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement