బీసీలకు అండగా వైఎస్సార్‌ సీపీ | Sakshi
Sakshi News home page

బీసీలకు అండగా వైఎస్సార్‌ సీపీ

Published Fri, Nov 17 2023 1:40 AM

- - Sakshi

ఒంగోలు సబర్బన్‌: బీసీలంటే బ్యాక్‌ వార్డు క్లాస్‌ కాదు బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని ఆదరించి బీసీలకు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. స్థానిక ఒంగోలు నగరంలోని బాలినేని నివాసంలోని సమావేశ మందిరంలో గురువారం బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతి రావు అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బాలినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీలకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. అటు రాజకీయంగా, సామాజికంగా సీఎం వైఎస్‌ జగన్‌ బలాన్ని చేకూర్చారని అన్నారు. బీసీలకు చెందిన అన్ని కులాలు పార్టీకి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. బీసీ సంఘాలు, కులాలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని కొనియాడారు. ఈ నెల 21వ తేదీన ఒంగోలు సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ఈ బస్సు యాత్ర రాష్ట్రంలోనే గొప్ప పేరు తెచ్చుకునేలా విజయవంతం చేయాలని బీసీ సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాలు, చేతి వృత్తుల వారు ప్రత్యేకంగా శకటాలను రూపొందిస్తున్నారని వెల్లడించారు. ఎంతో ఆకర్షణీయంగా ఈ శకటాల రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనను అన్ని బీసీ కులాల నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆదరించారని, ఇకపై కూడా మీ ఆదరాభిమానాలు ఉండాలని ఆకాంక్షించారు. ఒంగోలు నగరంలో అన్ని కులాలకు ఆరామ క్షేత్రాలకు స్థలాలు కేటాయించానని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వాళ్లకు కూడా కేటాయిస్తానని బాలినేని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు, నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్‌, ఏఎంసీ చైర్మన్‌ కొఠారు రామచంద్రరావు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌లు, డైరెక్టర్లు చేతాడ శ్రీవైష్ణవ కార్పొరేషన్‌ చైర్మన్‌ మనోజ్‌, మేదర కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతా లలితతో పాటు కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ చూసుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌ బీసీ వర్గాలు తనను ఎంతో ఆదరిస్తున్నారు బీసీల ఆత్మీయ సదస్సులో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని

Advertisement
 
Advertisement
 
Advertisement