గంటవానిపల్లి హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

గంటవానిపల్లి హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

Published Thu, Nov 16 2023 12:34 AM

జీవో పత్రాన్ని నాయకులకు అందజేస్తున్న మంత్రి సురేష్‌   - Sakshi

పెద్దదోర్నాల: గంటవానిపల్లి గ్రామస్తుల చిరకాల స్వప్నమైన హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన పరిపాలన అనుమతుల జీ.ఓ పత్రాన్ని గ్రామ సర్పంచ్‌ యక్కంటి రమాదేవి వెంకటేశ్వరరెడ్డికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ బుధవారం అందజేశారు. యర్రగొండపాలెంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు, గుంటూరు రహదారి నుంచి తీగలేరు మీదుగా గంటవానిపల్లి గ్రామానికి నిర్మించే ఈ బ్రిడ్జికి సంబంధించి రూ.270 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ నంబర్‌ 763 పత్రాన్ని సర్పంచ్‌తో పాటు గ్రామ నాయకులకు మంత్రి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు సింగంశెట్టి బాలవెంకటేశ్వర్లు, నడిపి రాములు, బొటుకు లక్ష్మయ్య, దొందేటి వెంకటేశ్వరరెడ్డి, సింగంశెట్టి నడిపి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రూ.270 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం జీ.ఓ పత్రాన్ని గ్రామస్తులకు అందజేసిన మంత్రి సురేష్‌

 
Advertisement
 
Advertisement