కదం తొక్కిన కనిగిరి | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన కనిగిరి

Published Thu, Nov 9 2023 1:12 AM

- - Sakshi

సామాజిక చైతన్యంతో..
సామాజిక సాధికారతతో సరికొత్త వెలుగులు తీసుకొచ్చిన అభిమాన నేత, ముఖ్యమంత్రికి అణగారిన వర్గాల వారు జేజేలు పలికారు. వై నాట్‌ 175.. జగన్‌ మళ్లీ రావాలి..జగనే కావాలి అంటూ నినదించారు. కనిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనంతో పట్టణం హోరెత్తింది. సాధికారిక యాత్రకు అడుగడునా జనం నీరాజనం పలికారు.

కనిగిరి రూరల్‌: కనిగిరి జనసంద్రమైంది. వైఎస్సార్‌ సీపీ సామాజిక, సాధికార యాత్ర సభకు జనం పోటెత్తారు. చిన్నా..పెద్దా తేడా లేకుండా అభిమాన గణం కేరింతలతో కోలాహలంగా మారిపోయింది. బుధవారం మధ్యాహం నుంచి ప్రారంభమైన సందడి ఆరు గంటలపాటు ఆద్యంతం ఉత్సాహ భరిత వాతావరణంలో జరిగింది. జనం చేతుల్లో పార్టీ జెండాలు రెపరెపలాడాయి. యాత్ర దిగ్విజయం కావడంతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బుధవారం మధ్యాహ్నం కనిగిరి మండలంలో నందనమారెళ్ల వద్ద ప్రారంభమైన సామాజిక సాధికార పాదయాత్ర ఎంతో ఉత్సాహ భరితంగా సాగింది. నందనమారెళ్ల వద్ద ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఎంపీ, పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమత్రి అంజాద్‌ బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేరుగు నాగార్జున, మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, బీదా మస్తాన్‌రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకారావు మాదిగ, పార్టీ నాయకులకు ఘనస్వాగతం పలికారు. అక్కడే ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ప్రభుత్వం అందజేసిన నూతన సబ్సిడీ ట్రాక్టర్లతో స్వాగతం పలికారు. అనంతరం సాగిన యాత్రలోని నాయకులకు సూరా పాపిరెడ్డి నగర్‌ వద్ద లారీ వర్కర్స్‌ కార్మికులు, కాశిరెడ్డి నగర్‌ వద్ద ఎస్టీలు, యానాదులు, దేవాంగనగర్‌ వద్ద ముస్లింలు, కేటీఆర్‌ స్కూల్‌ వద్ద విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. స్థానిక చెక్‌పోస్టు వైఎస్సార్‌ విగ్రహానికి ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే బుర్రా, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అక్కడ బొల్లావులతో ఘన స్వాగతంతో పట్టణంలో పాదయాత్ర ప్రారంభమైంది. స్థానిక ఒంగోలు బస్టాండ్‌లో కౌన్సిలర్‌ సయ్యద్‌ రిజ్వాన ఆధ్వర్యంలో మహిళలు ఘన స్వాగతం పలికారు. అక్కడే హజరత్‌ పాచ్ఛాహుస్సేని దర్గాలో నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం యూత్‌ నాయకులు అతిథులను ఘనంగా సన్మానించారు. బస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక బొడ్డు చావిడి సెంటర్‌లో వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి యాత్ర నాజ్‌ సెంటర్‌, శ్రీనివాస మహల్‌ సెంటర్‌, వైఎస్సార్‌ రోడ్డు, మీదుగా వచ్చి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో నేతలు మాట్లాడారు. సభా వేదిక ముందు ఎంపీ, పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ విజయ సాయిరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు కూర్చున్నారు.

పాదయాత్రలోని ప్రధాన అంశాలు

● పాదయాత్ర నాయకులకు పార్టీ యూత్‌ ఆధ్వర్యంలో సుమారు వందల బైక్‌లతో ఘన స్వాగతం పలికారు.

● సభలో ముఖ్య నేతల ప్రసంగాల్లో రానున్న ఎన్నికల్లో ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని, ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను తిరిగి గెలిపించాలని పిలుపునివ్వడంతో ప్రజలు కేరింతలు కొట్టారు.

● ఎమ్మెల్యే బుర్రా, చైర్మన్‌ గఫార్‌ల వినతి మేరకు పట్టణంలో నూతన షాదీఖానా ఏర్పాటుకు రూ.2 కోట్ల మంజూరుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా హామీ ఇచ్చారు.

● కనిగిరిలో స్పందన హాల్‌ ఏర్పాటుకు రూ.50 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే వినతి మేరకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు.

● సభలో వైఎస్సార్‌ సీపీ మైనార్టీ నాయకులు ఎస్‌కే బుజ్జీ భారీ గజమాలతో అంజాద్‌బాషా, హాఫీజ్‌ ఖాన్‌, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌లను సన్మానించారు.

● సభలో ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌, ఎమ్మెల్యే బుర్రాలు కలిసి వైఎస్సార్‌ సీపీ జెండాను పట్టుకుని ఊపడంతో యువతలో, ప్రజల్లో ఉత్సాహం హోరెత్తింది.

● పాదయాత్రలో స్థానిక 13వ వార్డు కౌన్సిలర్‌ సయ్యద్‌ రిజ్వాన ఎంపీ విజయసాయిరెడ్డికి, ఎమ్మెల్యే బుర్రాకు, ఎంపీ, మంత్రులకు వీర కంకణం కట్టి స్వాగతించారు.

● పాదయాత్రలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హారతులిచ్చారు. విజయకేతనానికి చిహ్నంగా పావురాళ్లను ఎగుర వేశారు.

● వాసవీ సత్ర జాతీయ అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, వైస్‌ చైర్మన్లు పులి శాంతి గోవర్ధన్‌రెడ్డి, ఆర్‌ మాణిక్యరావు, తమ్మినేని సుజాత, దేవకి సత్యావతి, దీప, రామన బోయిన ప్రశాంతిశ్రీను, దాసరి మురళీ, దేవకి రాజీవ్‌లు ఘనంగా సన్మానించారు.

● సభా ముగింపు తర్వాత ఎమ్మెల్యే బుర్రాతో కలిసి స్థానిక నేతలు విజయ చిహ్నాన్ని చూపారు.

వైఎస్సార్‌ సీపీ చేపట్టిన పాదయాత్ర, వివిధ కార్యక్రమాల్లో గంగసాని లక్ష్మి, మూడమంచు వెంకటేశ్వర్లు, గాయం సావిత్రి, అత్యాల జఫన్య, జెడ్పీటీసీలు చప్పిడి సుబ్బయ్య, మేకల శ్రీనివాసుల యాదవ్‌, లక్ష్మీ కాంతంరెడ్డి, పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి పెరుగు మురళీకృష్ణ, సీహెచ్‌ సాల్మన్‌, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు రంగనాయకుల రెడ్డి, సంగు సుబ్బారెడ్డి, గంగసాని హుస్సేన్‌రెడ్డి, జీ బొర్రారెడ్డి, భువనగిరి వెంకటయ్య, వేల్పుల వెంకటేశ్వర్లు, ఖాదర్‌బాషా, బుజ్జీ, యక్కంటి శ్రీను, మహేష్‌ నాగ్‌, చెరుకూరి సతీష్‌, గజ్జల వెంకటరెడ్డి, డాక్టర్‌ రసూల్‌, శ్రీరాం సతీష్‌, కిషోర్‌, మాలీ, చింతం శ్రీను, నాలీ, మీరావలి, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జెండాలు చేతబట్టి కార్యకర్తల ఉత్సాహం
1/4

వైఎస్సార్‌ సీపీ జెండాలు చేతబట్టి కార్యకర్తల ఉత్సాహం

వేదిక ముందు  విజయసాయిరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు
2/4

వేదిక ముందు విజయసాయిరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు

బొల్లావులతో విజయసాయిరెడ్డి, బుర్రా పక్కన ఎంపీ మాగుంట
3/4

బొల్లావులతో విజయసాయిరెడ్డి, బుర్రా పక్కన ఎంపీ మాగుంట

ఆకట్టుకున్న విచిత్ర వేషధారణలు
4/4

ఆకట్టుకున్న విచిత్ర వేషధారణలు

Advertisement
Advertisement