సంతనూతలపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో | Sakshi
Sakshi News home page

సంతనూతలపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో

Published Mon, Oct 30 2023 1:46 AM

-

చీమకుర్తి: సంతనూతలపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో 1972–73వ సంవత్సరం పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా సాగింది. డాక్టర్లు, ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వారు, వ్యాపారాల్లో స్థిరపడిన వారంతా 50 ఏళ్ల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చీమకుర్తి మండలం పల్లామల్లిలో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న రిటైర్డ్‌ టీచర్‌ మద్దాలి సుబ్బారావును పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. డాక్టర్లు మణిమాల, రాఘవేంద్ర ప్రసాద్‌, ఇతర రంగాల్లో స్థిరపడిన వారంతా తమ కుటుంబాల యోగక్షేమాల గురించి పంచుకున్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని సరస్వతిదేవి విగ్రహానికి పూలమాలలు వేశారు.

Advertisement
 
Advertisement