దాడులు చేయడమే ప్రక్షాళనా?.. టీడీపీపై నాగార్జున యాదవ్‌ ఫైర్‌ | YSRCP Leader Nagarjuna Yadav Fires On TDP | Sakshi
Sakshi News home page

వర్సిటీ వీసీలపై దాడులు చేయడమే ప్రక్షాళనా?.. టీడీపీపై నాగార్జున యాదవ్‌ ఫైర్‌

Published Wed, Jun 19 2024 5:47 PM | Last Updated on Wed, Jun 19 2024 6:11 PM

Ysrcp Leader Nagarjuna Yadav Fires On Tdp

సాక్షి, తాడేపల్లి: యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామని టీడీపీ నేతలు చెప్తున్నారు.. యూనివర్సిటీల్లోకి వెళ్లి వీసీలపై దాడులు చేయటం ప్రక్షాళన అంటారా? అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ మండిపడ్డారు. వీసీల కారు డ్రైవర్లపై దాడులు చేయటం ప్రక్షాళనా?. వైఎస్సార్‌ విగ్రహాలను తొలగించటం ప్రక్షాళనా?. మరి ఎన్టీఆర్ విగ్రహాలను ఎందుకు తొలగించలేదు?’’ అని నాగార్జున యాదవ్‌ ప్రశ్నించారు.

‘‘అనేక యూనివర్సిటీలలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వీసీలు, రిజిస్టార్లు లేరా?. ఎస్వీ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలలో చంద్రబాబు, లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరపలేదా?. యూనివర్సిటీలను చంద్రబాబు హయాంలో కులాలకు అడ్డాగా మార్చారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే ర్యాంకింగ్ పెరిగింది. ఉన్నత విద్య విషయంలో జగన్ అనేక మార్పులు తెచ్చారు’’ అని నాగార్జున యాదవ్‌ చెప్పారు.

‘‘విదేశాల్లోని అత్యున్నత యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని కొత్తకొత్త పాఠ్యాంశాలు తెచ్చారు. విద్యార్థులకు ఉపయోగకరమైన పనులు చేశారు. 3,295 పోస్టుల ఖాళీలను పూర్తి చేయటానికి వైఎస్‌ జగన్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై కూడా కోర్టుకు వెళ్లి ఆపేసిన నీచ చరిత్ర టీడీపీది’’ అంటూ నాగార్జున యాదవ్‌ ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement