టీడీపీవి అనైతిక రాజకీయాలు 

YSRCP Leader Dharmana Krishnadas On TDP - Sakshi

మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీని అప్రతిష్టపాలు చేస్తారా?

ఆ వీడియో నిజమైతే బాబు, లోకేష్‌ల ఫోన్ల నుంచే అప్‌లోడ్‌ చేయొచ్చుగా

పోలాకి: మార్ఫింగ్‌ వీడియోతో అనైతిక రాజకీయాలు చేసిన టీడీపీ మరోసారి దాని దిగజారుడుతనాన్ని బయట పెట్టుకుందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వీడియోపై దర్యాప్తు చేస్తే వైఎస్సార్‌సీపీ ఖాళీ అవుతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అనడం నారా వారి మెప్పు కోసం చేసిన ప్రయత్నమేనని చెప్పారు.

మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మీ బాబాయే పార్టీ లేదు..బొక్కా లేదని ఎప్పుడో చెబితే ఇప్పుడు నువ్వు టీడీపీని బతికించే పనిలో ఉన్నావా? అని ఎద్దేవా చేశారు. ఒక లోక్‌సభ సభ్యుడిని, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, అందులోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతానికి చెందిన వ్యక్తిని అప్రతిష్టపాలు చేయటం కోసం టీడీపీ ఎంచుకున్న దారి చూస్తే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉంటుందా అని అనిపిస్తుందన్నారు.

అసలు అప్‌లోడ్‌ చేసిన వీడియో ఎక్కడిది, అది మీకు ఎక్కడ నుంచి వచ్చింది, ఈ చర్య వల్ల ఎవరైనా మహిళ వేధింపులకు గురయిందా, లేదా బాధపడినట్లు ఫిర్యాదు అందిందా అని ప్రశ్నించారు. అది వాస్తవమే అయితే ఐటీడీపీకి చెందిన నంబర్లతో పరాయి దేశాల నుంచి ఎందుకు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారని అన్నారు.  

ధైర్యం ఉంటే నేరుగా టీడీపీ అధ్యక్షుడు లేదా చంద్రబాబు, లోకేష్‌ల ఫోన్ల నుంచే అప్‌లోడ్‌ చేయవచ్చు కదా అని అన్నారు. ప్రజల తరఫున కాకుండా బూతు వీడియోల కోసం పోరాటాలు చేసిన స్థాయికి టీడీపీ దిగజారిందన్నారు. అనేక ఎన్నికల్లో జనాలు ఛీకొట్టినా ఇంకా సిగ్గులేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top