వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు

TDP Leaders In Chittor Join YSRCP - Sakshi

పీలేరు(చిత్తూరు) : పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నేతలు ఆదివారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  వీరిలో ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు బలసా వేణుగోపాల్, తిరుపాల్, ప్రకాష్, హరి, సుమంత్, భగవాన్‌తోపాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికి అండగా ఉంటామన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సైతం ప్రత్యేక గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్, డాక్టర్‌ వెంకటరామయ్య, దండు జగన్‌మోహన్‌రెడ్డి, మువ్వల నరసింహులు, కూనా సత్యం, రామనారాయణ, జక్కా సుబ్బరాజు, వెంకటేష్, రవి పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top