నమ్ముకుంటే నట్టేట ముంచారు

TDP Janasena Leader Fire On Chandrababu and Pawan Kalyan  - Sakshi

సీటు ఎలా ఇస్తాం.. రూ.50 కోట్లు చూపించాలని చెప్పాను కదా... అదేంటి సార్‌.. పార్టీ కష్టకాలంలో ఉంటే.. మా ఆస్తులన్నీ అమ్మి క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చాం కదా.. ఈ సమయంలో ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి. ఇదిగో రూ.20 కోట్లు మాత్రమే ఉన్నాయి. మీరు కొంచెం సహకరిస్తే.. ఏయ్‌.. మాటల్లేవ్‌.. మాట్లాడుకోడాల్లేవ్‌.. ఓటుకు నోటు ఎలాగో.. సీటుకు కోట్లు అలాగే.. ఇది ఫిక్స్‌. అసలే పొత్తు లెక్కలతో ప్రతి సీటుకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. మీలాంటి వాళ్లకు సీటివ్వలేను. తమాషాలు చేయకుండా.. పార్టీకి పనిచేయండి..  ఇవీ.. సీనియర్‌ నేతలు, పార్టీని భుజస్కంధాలపై మోసిన నాయకులతో చంద్రబాబు నిస్సిగ్గు వ్యాఖ్యలు. 

సాక్షి, విశాఖపట్నం: నోట్ల కట్టలు చూపించినవారికే టికెట్‌ కన్ఫార్మ్‌ చేసిన చంద్రబాబు వైఖరిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పార్టీని నమ్ముకుంటూ పనిచేస్తుంటే నోట్ల కట్టలకు సీట్లు అమ్ముకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోకపార్టీ జనసేన లో నూ ఇదే వైఖరి కనిపిస్తోంది. పదేళ్లు కష్టపడిన వారిని పక్కన పెట్టేసి.. కొత్తగా కండువా కప్పుకున్న వారికి టికెట్‌ కట్టబెట్టిన పవన్‌ వ్యవహారంపైనా క్యాడర్‌లో వ్యతిరేకత మొదలైంది. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే సుకొని కండువాపై కండువా వేసుకుంటూ ప్రచారం చేయడం తమ వల్ల కాదంటూ టీడీపీ, జనసేన నాయకులు కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఉమ్మడి విశాఖలో ప్రతి నియోజకవర్గంలోనూ ఈ అసమ్మతి కుంపటి రోజురోజుకూ రాజుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలోనూ క్యాడర్‌ మొత్తం చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ తీరును తూర్పారపడుతున్నారు.  

ద్వితీయశ్రేణి నేతలపై నిర్లక్ష్యం 
ఉత్తర నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు గెలిచిన నాటి నుంచి నియోజకవర్గం ముఖం చాటేసిన తర్వాత.. అక్కడి కార్పొరేటర్లు, ద్వితీయశ్రేణి నేతలు పారీ్టకి కాపుకాస్తూ వచ్చారు. అయితే ఇక్కడ టికెట్‌ను బీజేపీకి కేటాయించడంతో పారీ్టలో ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారంటూ టీడీపీ నేతలు 
మండిపడుతున్నారు. 

గంటాకు సీటు అమ్మేశారు 
భీమిలి నియోజకవర్గంలో ఆది నుంచి క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్న కోరాడ రాజబాబు, కర్రోతు బంగార్రాజును గతంలో మెచ్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారి దగ్గర డబ్బులు లేవంటూ గంటా వైపు మొగ్గు చూపారు. సుమారు రూ.20 కోట్ల వరకూ ఖర్చు చేయగలనని చంద్రబాబుకు చెప్పి.. టికెట్‌ ఇవ్వాలని కోరాడ కోరినా.. సరిపోవంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వర్గాలు బాబు వైఖరిపై మండిపడుతున్నాయి. భీమిలిని నాశనం చేసిన గంటాకు టికెట్‌ అమ్మేసుకున్నారంటూ టీడీపీ శ్రేణులే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నాయి. 

నమ్ముకున్నోళ్లకు ఝలక్‌ 
అనకాపల్లి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆది నుంచి పార్టీలో ఉన్న పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీష్‌ టికెట్‌ ఆశించారు. వీరితో పాటు పూటకో పార్టీ మారే దాడి వీరభద్రరావు కూడా టికెట్‌ ఆశించి.. టీడీపీలోకి జంప్‌ అయ్యారు. వీరందరికీ చెక్‌ చెప్పి.. జనసేనకు టికెట్‌ కేటాయించడంపై అందరిలోనూ ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డబ్బులు మూటలకే టికెట్లు కేటాయించారంటూ చంద్రబాబుపై టీడీపీ కేడర్‌ విమర్శిస్తోంది.

‘గ్లాసు’లోనూ అసమ్మతి తుపాను
ఇక పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబుతోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా పయనిస్తూ.. చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కూడా.. బాబు లక్షణాలు వంటబట్టాయి. తనని నమ్ముకొని పారీ్టలోకి వచ్చిన వారి భవిష్యత్తును గాలిలో దీపం మాదిరిగా వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు పవన్‌ పొత్తు వైఖరిని దుమ్మెత్తి పోస్తున్నారు. టికెట్‌ ఆశించి పారీ్టకి ఏ తాడు బొంగరం లేకపోయినా అన్నీ తామై కోట్లు ఖర్చు చేసిన వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. నియోజకవర్గంలో జనసేన కోసం పాటుపడిన వారికి, టికెట్‌ ఆశించి పారీ్టలో చేరిన వారికీ పవన్‌ ఝలక్‌ ఇచ్చారు. 

భీమిలిలో పంచకర్ల సందీప్‌కు టికెట్‌ ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో మోసం చేయడంపై భీమిలి జనసేన వర్గం పవన్‌ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దక్షిణంలో టికెట్‌ ఇస్తామన్న హామీతో గ్లాసు పట్టుకున్న కార్పొరేటర్లు కందుల నాగరాజు, సాధిక్‌.. పవన్‌ను నమ్ముకొని రోడ్డున పడ్డారు. ఉత్తర నియోజకవర్గంలో పసుపులేటి ఉషాకిరణ్‌కీ పవన్‌ వెన్నుపోటు పొడిచారు. గాజువాక టికెట్‌ ఆశించి పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు చేసిన సుందరపు సతీ‹Ùని కరివేపాకులా తీసిపారేశారు. అనకాపల్లిలో పరుచూరి భాస్కరరావు పవన్‌ హ్యాండిచ్చారు. పాయకరావుపేటలో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితకు సీటు ఇవ్వొద్దని జనసేన నేత గెడ్డం బుజ్జి అభ్యర్థన కూడా పవన్‌ కల్యాణ్‌ పరిగణలోకి తీసుకోలేదు. ఇలా కూటమి పేరుతో టికెట్లు అమ్ముకున్నారంటూ జనసేన శ్రేణులు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి.  

బండారుకు జెల్ల 
పెందుర్తిలో సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తికీ చంద్రబాబు జెల్ల కొట్టారు. చివరి వరకూ పార్టీ టికెట్‌ నీదేనంటూ హామీ ఇచ్చిన బాబు.. చివరి నిమిషంలో జనసేనకు కట్టబెట్టడంతో టీడీపీ క్యాడర్‌ అసంతృప్తితో రగిలిపోతోంది. బండారుకు బద్ధశత్రువైన పంచకర్ల రమేష్‌బాబు వెంట పయనించే ప్రసక్తే లేదని, చంద్రబాబుకు ఇష్టం ఉంటే ఆయనే వచ్చి ప్రచారం చేసుకోవాలే తప్ప.. తాము సహకరించబోమని తెగేసి చెబుతున్నారు. 

రూ.50 కోట్లకు సీటు అమ్ముకున్నాడని ప్రచారం 
మాడుగుల సీటును మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పీవీజీ కుమార్‌ సీటు ఆశించారు. వీరిని కాదని ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాదరావుకు టికెట్‌ కేటాయించారు. రూ.50 కోట్లకు చంద్రబాబు టికెట్‌ను అమ్ముకున్నారన్న ఆరోపణలు టీడీపీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. 

డబ్బులు లేవని పక్కన పెట్టేశాడు 
యలమంచిలి టికెట్‌ను జనసేనకు అమ్ముకున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టికెట్‌ ఆశించిన ప్రగడ నాగేశ్వరరావు, పప్పల చలపతిరావు వద్ద డబ్బులు లేవన్న సాకుతో టికెట్‌ లేదని చెప్పడంతో.. వారిని నమ్ముకున్న క్యాడర్‌ రగిలిపోతోంది. సోమవారం జరిగిన ఆతీ్మయ సమావేశంలోనూ పార్టీ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. జనసేనకు చంద్రబాబు ఇక్కడ టికెట్‌ను అమ్ముకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మన్యంలో మాయాజాలం 
పాడేరులో టికెట్‌ కోసం పోటీపడిన గిడ్డి ఈశ్వరి, మణికుమారిని కాదని.. డబ్బులు దండిగా ఉన్నాయన్న లెక్కలతో కిల్లు రమే‹Ùనాయుడుకు చంద్రబాబు టికెట్‌ కేటాయించారు. దీంతో మిగిలిన రెండు వర్గాలూ.. ఇది మూమ్మాటికీ నోటుకు సీటు అంటూ చెబుతున్నారు. టికెట్‌ కోసం పోరాటం చేస్తాం తప్ప.. కూటమి వెంట నడిచే సమస్యే లేదంటున్నారు. టికెట్లు అమ్ముకుంటే పార్టీ కోసం పనిచేసేవారి పరిస్థితి ఏంటో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
 
అరకులో అదే తీరు
అరకులో పర్యటించిన సమయంలో దొన్నుదొర అభ్యర్థి అంటూ చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయితే పార్టీ టికెట్‌ ఆశించిన కిడారి శ్రవణ్, అబ్రహంను కూడా పక్కకు నెట్టేశారు. అరకులో అంతగా ప్రభావంలేని బీజేపీకి చెందిన పాంగి రాజారావుకి టికెట్‌ ఇవ్వడం వెనుక రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అబ్రహం రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించగా.. దొన్నుదొర, శ్రావణ్‌ వర్గాలు మాత్రం చంద్రబాబు వైఖరిని తప్పుపడితూ.. కూటమికి సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి.  

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top