ఇది ప్రాణాలు తీసే ప్రభుత్వం: రేవంత్‌రెడ్డి 

Revanth Reddy Comments On KCR Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని టీపీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అడ్డగోలు బదిలీతో మనస్తాపం చెంది బీంగల్‌ మండలం, బాబాపూర్‌ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

317 జీవో విడుదలైన నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడితో గుండె ఆగడంతోనో లేదాం బలవన్మరణానికి ఒడిగట్టో ప్రాణాలు వదులుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఉద్యోగుల కేటాయింపు, బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో ఉందన్నారు. ఈ చావులకు ప్రభుత్వమే కాదుం వాళ్లకు వత్తాసు పలికే ఉద్యోగ సంఘాలు కూడా బాధ్యులేనని చెప్పారు. 317 జీవో రద్దు కోసం ప్రభుత్వంపై పోరాడుదామని, మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు తీసుకోవద్దని ఉద్యోగులకు రేవంత్‌ సూచించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top