అవేమీ పవన్‌కు కనపడటం లేదా?

Perni Nani Takes On Pawan Kalyan - Sakshi

తాడేపల్లి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం సీఎం జగన్‌ తెచ్చిన పథకాలు అమలు చేస్తుంటే పవన్‌కి కనపడటం లేదా? అని ప్రశ్నించారు పేర్ని నాని.  ‘2014లో తనను చూసి ఓటేయమన్నారు.టీడీపీ, బీజేపి తప్పు చేస్తే తాను ప్రశ్నిస్తానన్నారు. కానీ రైతులకు రుణమాఫీ పేరుతో టీడీపీ, బీజేపీ దగా చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు? , ఐదేళ్లలో కేవలం 15 వేల కోట్లను మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుంటే మీరేం చేస్తున్నారు?, ఎందుకు ఆనాడు మీ నోట మాట రాలేదు?,  మీకు తెలిసిందల్లా కేవలం జగన్ ని ప్రశ్నించటం మాత్రమే.

పంటనష్ట పరహారం, విత్తనాల పంపిణీ వంటివి చేయకపోయినా మీరు ఎందుకు ప్రశ్నించలేదు?, ఇప్పుడు జగన్ రైతులకు అండగా వున్నట్టు మీ టీడీపీ, బీజేపి నిలపడిందా?, కౌలు రైతుల గురించి మీరు పొత్తులో ఉన్న బీజేపి ఎక్కడైనా సాయపడిందా?, ప్రతిసారీ ఢిల్లీ వెళ్తున్న మీరు మోదీని ఎందుకు అడగటం లేదు?, పీఎం కిసాన్ పథకంలో కౌలు రైతులకు డబ్బులు ఎందుకు ఇవ్వటం లేదో మోదీని ఎందుకు అడగలేదు?, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా మీరు ఎందుకు తేలేకపోయారు?, అసలు బీజేపితో కలిసి మీరు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారు?, ప్రత్యేక హోదా తెచ్చారా?, వైజాగ్ స్టీల్ ప్లాంటును ఏమైనా ఆపారా?, మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ ఓడించాలని చెప్పారు.

2024 ఎన్నికల్లో ఎవరితో వెళ్తారో చూద్దాం. అప్పుడు చంద్రబాబుకు దత్తపుత్రుడు అవునో, కాదో తేలుతుంది. అయ్యన్నపాత్రుడి మాటలు పవన్కి వినసొంపుగా ఉన్నాయా?, చంద్రబాబు చెప్పమన్న మాటలు పర్చూరు వేదిక చెప్పటం  సిగ్గుచేటు.జగన్ నిజాయితీతో పని చేస్తున్నారు. 2014 నుంచి పవన్ కళ్యాణ్ మాటలు నిలకడలేనివి.బాధ్యతలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రశ్నిస్తానని చెప్పి చేయని పవన్‌ను ప్రజలు నిలదీయాలి. అయ్యన్న పాత్రుడు ఆక్రమణలకు పాల్పడితే చూస్తూ ఊరుకోవాలా?, కౌలు రైతుల గురించి మీరు పొత్తులో ఉన్న బీజేపి ఎక్కడైనా సాయపడిందా?, ప్రతిసారీ ఢిల్లీ వెళ్తున్న మీరు మోడీని ఎందుకు అడగటం లేదు?, పీఎం కిసాన్ పథకంలో కౌలు రైతులకు డబ్బులు ఎందుకు ఇవ్వటం లేదో మోదీని ఎందుకు అడగటం లేదు?, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా మీరు ఎందుకు తేలేకపోయారు?, అసలు బీజేపీ కలిసి మీరు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారు? అని పేర్ని నాని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top