Telangana Assembly Elections: 2023 దేవరకద్ర ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

Devarakadra  - Sakshi

2023లో పోటీ చేస్తున్న అభ్యర్థులు:  గవినోళ్ల మధుసూధన్ రెడ్డి (కాంగ్రెస్), ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్), కొండా ప్రశాంత్ రెడ్డి (బీజేపీ), బసిరెడ్డి సంతోష్ రెడ్డి (బీఎస్పీ)

ఉద‌యం 9గం వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ శాతం: 12%

దేవరకద్ర నియోజకవర్గం

జిల్లా: మహబూబ్‌ నగర్‌
రాష్ట్రం: తెలంగాణ
మొత్తం ఓటర్ల సంఖ్య: 228,281
పురుషులు: 113,528
మహిళలు: 114,556

చ‌ద‌వండి: 2023 కొల్లాపూర్ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

దేవరకద్ర నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి:
మహబూబ్ నగర్ జిల్లా
- దేవరకద్ర
- భూత్పూర్
- అడ్డాకల్
- మదనపూర్
- మూసాపేట్
వనపర్తి జిల్లా
చిన్న చింతకుంట
కొత్తకోట

2023లో పోటీ చేస్తున్న అభ్యర్థులు 

గవినోళ్ల మధుసూధన్ రెడ్డి (కాంగ్రెస్)
ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్)
కొండా ప్రశాంత్ రెడ్డి (బీజేపీ)
బసిరెడ్డి సంతోష్ రెడ్డి (బీఎస్పీ)

నియోజకవర్గం ముఖచిత్రం

ఈ నియోజకర్గం మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన 2008లో భాగంగా రద్దైన అమరచింత స్థానంలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం 1962 వరకు ఆత్మకూరు నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఐదు సార్లు టీడీపీ గెలవగా, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌(ఐ)లు కలిసి ఐదుసార్లు విజయకేతనం ఎగురవేసాయి. ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌లు రెండుసార్లు విజయం సాధించారు. 2014లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. ఇక్కడి నుంచి అత్యధికంగా కే. దయాకరరెడ్డి టీడీపీ తరపున, ఎస్‌ భూపాల్‌ (ఒకసారి కాంగ్రెస్‌ ఒకసారి ఇండిపెండెంట్‌) రెండుసార్లు గెలుపొందారు.

2009లో నియోజకవర్గ పునర్ విభజనలో అమరచింత నియోజకవర్గం రద్దై దేవరకద్ర నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. దేవరకద్ర నియోజకవర్గంలో సిటింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధి పవన్‌ కుమార్‌ రెడ్డిపై  34385 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. వెంకటేశ్వరరెడ్డి కి 93358 ఓట్లు రాగా, పవన్‌ కుమార్‌ రెడ్డికి 58973 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నర సింహులుకు 5300 పైగా ఓట్లు వచ్చాయి. 2009శాసనసభ ఎన్నికలలో దంపతులైన టిడిపి నేతలు దయాకరరెడ్డి, సీత ఇద్దరూ రెండు నియోజకవర్గాల నుంచి  శాసనసభకు ఎన్నికై రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తే, 2014లో ఇద్దరూ పరాజితులు అయ్యారు.

దేవరకద్రలో సీతా దయాకరరెడ్డి  టిడిపి పక్షాన పోటీచేసి రెండోస్థానంలో కూడా ఉండలేకపోయారు. ఇక్కడ2014లో  టిఆర్‌ఎస్‌ నేత వెంకటేశ్వరరెడ్డి తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ధి పవన్‌ కుమార్‌ రెడ్డిపై 14642 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సీత భర్త దయాకరరెడ్డి ఒకసారి మక్తల్‌ నుంచి రెండుసార్లు అమరచింత నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేవరకద్ర, అమరచింత ల నుంచి తొమ్మిది  సార్లు రెడ్డి నేతలు గెలుపొందగా,రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఇతరులు గెలుపొందారు.

అమరచింత (2009లో రద్దు)
గతంలో ఉన్న అమరచింత నియోజకవర్గం 2009లో రద్దు అయింది. 1962 వరకు ఆత్మకూరు నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతంలో సోంభూపాల్‌ ఈ రెండుచోట్ల ఇండిపెండెంటుగా గెలిస్తే, 1972లో అమరచింతలో కాంగ్రెస్‌ పక్షాన ఏకగ్రీవంగా గెలవడం విశేషం. కాంగ్రెస్‌ ఐ తరుపున కె.వీరారెడ్డి రెండుసార్లు గెలవగా, అమరచింతలో రెండుసార్లు గెలిచిన కె.దయాకరరెడ్డి 2014లో  మక్తల్‌లో పోటీ చేసి గెలవడంతో మూడోసార్లు  విజయం సాధించినట్లయింది.

చ‌ద‌వండి: 2023 అలంపూర్‌ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top