ఈసారి కూటమి ఫెయిల్‌ ఖాయం: మంత్రి అంబటి | AP Minister Ambati Rambabu Satirical Comments On Chandrababu Naidu Delhi Tour, Details Inside - Sakshi
Sakshi News home page

Minister Ambati Rambabu: ఈసారి కూటమి ఫెయిల్‌ ఖాయం

Published Wed, Feb 7 2024 7:12 PM

AP Minister Ambati Rambabu Satires On Chandrababu Delhi Tour - Sakshi

గుంటూరు, సాక్షి: చంద్రబాబు బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చించడానికి వెళ్లారని తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు. కానీ, చంద్రబాబు ఎలాంటి వాడో బీజేపీ పెద్దలకు బాగా తెలుసని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఏపీ పొత్తు రాజకీయాల్లో తాజా పరిణామాలపై ఆయన మీడియతో స్పందించారు.

చంద్రబాబు ఎలాంటి వాడో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అందర్నీ వాడుకుని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. బీజేపీ నాయకుల్ని చంద్రబాబు తిట్టింది.. అమిత్‌ షాపై దాడి చేయించింది. వాళ్లు మరిచిపోవచ్చేమోగానీ.. ప్రజలు మాత్రం మరిచిపోరు. ఎవరి అవసరాల కోసం వారు తపన పడుతున్నారు అని మంత్రి అంబటి అన్నారు. ‘మా టార్గెట్ 175 కు 175 సీట్లు గెలవటం ఎన్ని పార్టీలు వచ్చినా ఎంత మంది కలిసి వచ్చిన వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీసీ అఖండ విజయం సాధిస్తుంది’ అని అంబటి ధీమా వ్యక్తం చేశారు. 

‘‘చంద్రబాబు ఒకవైపు పవన్ కళ్యాణ్ తో ఉండి మరొకవైపు బీజేపీ కలుపుకోవడానికి తపన పడుతున్నాడు. అంటే.. జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడో వారికి అర్థమవుతోంది. మాకు 55% పైగా ఓటింగ్ ఉంది. మిగిలిన శాతం.. మిగిలిన అన్ని పార్టీలు కలుపుకుంటే వస్తోంది. 2014లో అందరూ కలిసి విజయం సాధించారు.  కానీ ప్రభుత్వం మాత్రం విఫలమైంది. ఈసారి వారి కూటమి ఫెయిల్ అవ్వటం ఖాయం అని అంబటి జోస్యం చెప్పారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement