AP Political News Dec 27th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On Dec 27th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Dec 27th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Wed, Dec 27 2023 6:57 AM

AP Elections Political News Updates Headlines Dec 27th Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

5:54 PM, డిసెంబర్‌ 27, 2023
అంటే .. ఈ సారైనా మంగళగిరి కనికరించాలని..

 • మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచి పెట్టలేదు : లోకేష్‌
 • ప్రజలు నాకు పరీక్ష పెట్టారనుకున్నా
 • మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు
 • ఆ కసితో మంగళగిరి కోసం ముందుకెళ్తున్నా
 • మంగళగిరిలో ఓడిపోయినా నేను బాధపడలేదు
 • మంగళగిరికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశా : నారా లోకేష్

5:33 PM, డిసెంబర్‌ 27, 2023
సినిమా అనగానే భుజాలెందుకు తడుముకుంటున్నారు?

 • వ్యూహం సినిమాలో ఏదో చూపిస్తున్నానని కంగారు పడుతున్నారు : ఆర్జీవీ
 • నాకు తెలిసిన విషయాలను సినిమాగా తీశా
 • ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?
 • మీరు ఏమీ తప్పు చేయనప్పుడు ఎందుకు భయం?
 • వాళ్లకు వాళ్లే ఏదో ఊహించుకుంటున్నారు
 • నా ఫిర్యాదు పై డీజీపీ సానుకూలంగా స్పందించారు
 • ప్రొసీజర్ ఫాలో అయ్యి చర్యలు తీసుకుంటామని చెప్పారు
 • నేను సినిమాతో వివాదం సృష్టించడం లేదు
 • వివాదాలు చేస్తున్నది టీడీపీ వాళ్లే : ఆర్జీవీ

5:15 PM, డిసెంబర్‌ 27, 2023
ఎన్నికలొస్తున్నాయి.. ఏం చేద్దాం?

 • పార్టీ నేతలతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశం
 • ఏపీ భవిష్యత్‌ను నిర్ధేశించే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయన్న పవన్ కల్యాణ్
 • ఏపీ ఎన్నికల్లో ఈ సారయినా జనసేన కనిపించకపోతే పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకమవతుందన్న ఆందోళనలో పవన్‌ కళ్యాణ్‌
 • తన చుట్టూ ఉన్నవారిపై పవన్‌ కళ్యాణ్‌లో కొన్ని సందేహాలు
 • మీరు ఎంత నమ్మకంతో పనిచేస్తారో....అంతకన్నా రెట్టింపు నమ్మకంతో మేం అండగా ఉంటాం : పవన్ కల్యాణ్

4:54 PM, డిసెంబర్‌ 27, 2023
ఇదేం మాయరోగం.. నాపై ఎందుకు విష ప్రచారం? : నారాయణస్వామి

 • విజయవాడలో మాట్లాడిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
 • అంబేడ్కర్ ఆశయాలను సీఎం వై ఎస్ జగన్ నెరవేరుస్తున్నారు
 • అంబేడ్కర్ కోరుకున్నట్టు విద్యను అట్టడుగు వర్గాలకు అందిస్తున్నారు
 • విజయవాడలో అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం
 • వచ్చే నెలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తాం
 • చంద్రబాబు హయాంలో ఎస్సీలకు తీరని అన్యాయం జరిగింది
 • సీఎం జగన్ ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు ప్రాధాన్యం ఇచ్చారు
 • అంబేడ్కర్ విగ్రహా ప్రారంభోత్సవంను పండుగలా చేపడతాం
 • నాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
 • తిరుపతి అభివృద్ధి కోసం మాట్లాడితే మతం అపాదిస్తూ విమర్శలు చేస్తున్నారు
 • నేను హిందువునే..నాపై తప్పుడు ప్రచారం చెయ్యడం దారుణం

4:33 PM, డిసెంబర్‌ 27, 2023
తల తెస్తే కోటి ఇస్తారట.! : టిడిపి నేతలపై వర్మ కేసు

 • మంగళగిరి : కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై డిజిపికి ఫిర్యాదు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్
 • ఓ టీవీ ఛానల్ డిబేట్ లో తన తల తెచ్చినవారికి రూ. కోటి ఇస్తానంటూ బాహాటంగా ప్రకటించిన శ్రీనివాస్ పై ఫిర్యాదు
 • తనపై ఆరోపణలు చేసిన శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్న ఆర్జీవీ

3:49 PM, డిసెంబర్‌ 27, 2023
స్కిల్‌ కేసును CBIకి అప్పగించాలంటూ ఉండవల్లి పిటిషన్‌పై విచారణ

 • మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ
 • స్కిల్ కేసును సీబీఐ కి ఇవ్వాలన్న ఉండవల్లి పిటిషన్ పై విచారణ
 • 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదన్న పిటిషనర్
 • ప్రతివాదులు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నారని పేపర్ ప్రకటన ఇవ్వనున్నట్లు కోర్టుకు తెలిపిన పిటిషనర్
 • ఈ విషయంపై మెమో ఫైల్ చేసినట్లు కోర్టుకు తెలిపిన పిటిషనర్

స్కిల్‌ కేసులో ఏం జరిగిందంటే.?

 • టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం కేసు
 • డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి
 • 2017-2018లో నకిలీ ఇన్‌వాయిస్‌లతో బయటపడ్డ అక్రమం
 • వేర్వేరు రాష్ట్రాలు, ఇతర దేశాలతోనూ ఈ కుంభకోణానికి లింకులు
 • అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం
 • ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు­నాయుడే ప్రధా­న సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు
 • కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ
 • ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్‌ కూడా
 • షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు
 • చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ ఘరానా మోసం
 • రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం
 • ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం
 • రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం
 • ప్ర‌భుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారని సీఐడీ అభియోగం
 • ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర షెల్‌ కంపెనీలకు నిధుల మళ్లింపు
 • ఈ కుంభ‌కోణం 2016- 2018 మధ్య జ‌రిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు
 • ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు
 • చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు
 • సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
 • కోర్టుల విచారణలో కీలక ఆధారాలను సమర్పించిన సీఐడీ

3:45 PM, డిసెంబర్‌ 27, 2023
ఎన్నికల ముందు బాబు పచ్చ నాటకాలు : మంత్రి రోజా

 • చంద్రబాబు, పవన్ కు 175 చోట్ల అభ్యర్థులు దొరకడం లేదు : మంత్రి రోజా
 • కుప్పంలో గెలవాలని చంద్రబాబు రకరకాల నాటకాలు ఆడుతున్నారు
 • వచ్చే ఎన్నికల్లో కుప్పం ప్రజలు చంద్రబాబును ఫుట్ బాల్ ఆడుతారు
 • 30 ఏళ్లలో కుప్పం ప్రజలకు చంద్రబాబు కనీసం నీరు కూడా ఇవ్వలేదు
 • మా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పుకోవడం వారి శునకానందమే
 • ఏపీ రాజకీయాల్లోకి ఎవరొచ్చినా.. YSRCPకి వచ్చిన ఇబ్బందేమి లేదు
 • ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు : మంత్రి రోజా

3:32 PM, డిసెంబర్‌ 27, 2023
ఏపీలో ఏం చేద్దాం : కాంగ్రెస్‌ అధిష్టానం

 • ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ నేతలతో రాహుల్‌ సమావేశం
 • పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్
 • సమావేశంలో కేసీ వేణుగోపాల్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి
 • పల్లంరాజు, చింతా మోహన్, హర్షకుమార్, తులసీ రెడ్డి, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలి, మధు యాదవ్
 • ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా జీరో అయింది
 • ఏ రకంగా పార్టీని పునరుద్ధరించాలి?
 • ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు
 • కనీసం స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం లేదు
 • ఏ వర్గం మనకు అనుకూలం? ఏ ప్రాంతంలో ఎంట్రీ ఇవ్వొచ్చు?
 • ఇప్పుడు పార్టీని మళ్లీ పట్టాలెక్కించాలంటే ఏం చేయాలి?
 • పక్క పార్టీల్లో అసంతృప్తులెవరైనా ఉన్నారా?
 • మనం చేర్చుకుంటామంటే వచ్చే వాళ్లెవరయినా ఉన్నారా?
 • కర్ణాటక, తెలంగాణలో గెలిచాం, ఏపీలో ఏం చేద్దాం?
 • షర్మిల వస్తే కాంగ్రెస్‌కు ఏమైనా ఉపయోగం ఉంటుందా అని రాహుల్‌ ప్రశ్నలు
 • షర్మిల రాకతో పార్టీకి ప్రయోజనం ఉంటుందని రాహుల్ కి చెప్పిన కొందరు నేతలు
 • జనవరిలో మూడు సభలు నిర్వహించేలని కోరిన నేతలు
 • హిందూపురం, విశాఖ, అమరావతిలో సభలు పెడదామన్న నేతలు
 • రేపు ఢిల్లీకి వైఎస్ షర్మిల వస్తుందని చెప్పిన కొందరు నేతలు

3:22 PM, డిసెంబర్‌ 27, 2023
ఎన్నికల వేళ.. మార్పులు కామన్‌ : సజ్జల

 • ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజం : సజ్జల
 • మా పార్టీ మంచి ఫామ్ లో ఉంది కాబట్టే పోటీ చేయటానికి నాయకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు
 • అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
 • జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్నాం
 • అంబేద్కర్ ఆశయసాధనలో మా పార్టీ ఎప్పుడూ ముందుంటుంది : సజ్జల రామకృష్ణా రెడ్డి

3:14 PM, డిసెంబర్‌ 27, 2023
పకడ్బందీగా ఓటర్ల జాబితా

 • ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌ కమిషన్‌ (EC) కీలక ప్రకటన
 • ఓటర్ల జాబితాకు సంబంధించి ఏ అనుమానాలున్నా జనవరి 12లోగా ఫిర్యాదు చేయాలని సూచన
 • జనవరి 17న ఓటర్ల ముసాయిదా జాబితా వెల్లడి
 • జనవరి 22న ఓటర్ల తుది జాబితా వెల్లడి

3:04 PM, డిసెంబర్‌ 27, 2023
ఏం చేస్తే నమ్ముతారు? ఏం చెబితే వింటారు?

 • ఎన్నికల వేళ తెలుగుదేశం మాయోపాయాలు
 • జనాలకు చెప్పేందుకు నానా మాయమాటలు తయారీ
 • వచ్చే నెల నుంచి భారీ బహిరంగ సభలకు ప్లాన్
 • 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు నిర్వహించే యోచన
 • ప్రతి బహిరంగ సభకు లక్షమంది హాజరు అయ్యేలా పార్టీ ఇన్‌ఛార్జీలకు టార్గెట్‌లు
 • లెక్క తప్పిందా.. సీటు దక్కదంటూ హెచ్చరికలు

2:45 PM, డిసెంబర్‌ 27, 2023
ఎవరు బయటకు వస్తారబ్బా.?

 • సొంత బలం లేక పక్కచూపులు చూస్తోన్న తెలుగుదేశం, జనసేన
 • YSRCP నుంచి ఎవరైనా వస్తారా అని ఎదురుచూపులు
 • YSRCPలో టికెట్‌ దక్కని నేతల వెంట పడుతోన్న టిడిపి, జనసేన
 • వైసిపి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్‌ను పార్టీలో చేర్చుకున్న పవన్‌ కళ్యాణ్‌
 • మిగతా ప్రాంతాల్లోనూ అభ్యర్థులు దొరక్క అధికార పార్టీ వైపు చూపులు

2:32 PM, డిసెంబర్‌ 27, 2023
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలు: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

 • నాపై కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారు
 • నా ఆస్తులన్నీ సక్రమమే
 • ఉనికి కోసం జేసీ  రాద్ధాంతం చేస్తున్నారు
 • జెండాలు తొలగించకుండా సుందరీకరణ పనులు చేస్తామని జేసీ లేఖ ఇచ్చారు
 • ఇప్పుడేమో వైఎస్సార్ సీపీ జెండాలు తొలగించాలని జేసీ ఆందోళన చేయడం హాస్యాస్పదం
 • జేసీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు
 • జేసీ  అవినీతి అక్రమాల పై బహిరంగ చర్చకు సిద్ధం
 • బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారు
 • జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు జారితే ఊరుకునేది లేదు
 • జేసీ వర్గీయులు నా ఓర్పును పరీక్షించవద్దు
 • తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు జేసీ కుట్రలు చేస్తున్నారు

12:00 PM, డిసెంబర్‌ 27, 2023
ఉండవల్లి పిటిషన్‌పై విచారణ వాయిదా

 • మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా
 • స్కిల్ కేసును సీబీఐకి ఇవ్వాలన్న ఉండవల్లి పిటిషన్‌పై నేడు విచారణ 
 • 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదన్న పిటిషనర్ 
 • ప్రతివాదులు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నారని పేపర్ ప్రకటన ఇవ్వనున్నట్లు కోర్టుకు తెలిపిన పిటిషనర్ 
 • ఈ విషయంపై మెమో ఫైల్ చేసినట్లు కోర్టుకు తెలిపిన పిటిషనర్

11:30 AM, డిసెంబర్‌ 27, 2023
మేము సమ్మె చేయడం లేదు: వలంటీర్ల సంఘం

 • ఏపీలో వలంటీర్ల సమ్మె అంటూ పచ్చ మీడియా పిచ్చి కూతలు
 • ఎల్లో మీడియా చెత్త వార్తలో వలంటీర్లు ఆగ్రహం
 • ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చిన వలంటీర్ల సంఘం
 • వలంటీర్‌ వ్యవస్థ దేశానికే ఆదర్శం
 • ఇది తట్టుకోలేకనే తప్పుడు వార్తలు అంటూ సీరియస్‌ 
   

8:30 AM, డిసెంబర్‌ 27, 2023
టీడీపీ డైరెక్షన్‌లోనే వంగవీటి రంగా హత్య

 • పచ్చకత్తికి అసువులు బాసిన వంగవీటి రంగా
 • కాపులు రాజకీయంగా ఎదగకూడదని నాడు టీడీపీ కుట్రలు.
 • దొంగదెబ్బ తీసి రంగాను పొట్టనపెట్టుకున్న ఎల్లో బ్యాచ్‌
 • స్వార్థ రాజకీయాల కోసం కాపులను బలి తీసుకున్న చంద్రబాబు.

7:20 AM, డిసెంబర్‌ 27, 2023
ఆడుదాం ఆంధ్రపై పచ్చ బ్యాచ్‌ మరో కుట్ర..

 • ఏపీలో క్రీడాకారులను ప్రోత్సహించడంపై కూడా ఎల్లో బ్యాచ్‌ కుట్రలు
 • ప్రభుత్వం అందజేసిన బ్యాట్లను విరగొట్టిన పచ్చ బ్యాచ్‌
 • పిల్లలకు ఇచ్చిన వస్తువులపై కూడా అక్కస్సు
 • పచ్చ బ్యాచ్‌ తీరుపై సోషల్‌ మీడియాలో ఆగ్రహం 

7:05 AM, డిసెంబర్‌ 27, 2023
పవన్‌ కల్యాణ్‌కు మంత్రి అంబటి కౌంటర్‌
రాజకీయాల్లో హత్యలుండవ్‌, ఆత్మహత్యలే!

7:00 AM, డిసెంబర్‌ 27, 2023
ఏపీలో ఎన్నికల వేడి

 • కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనతో పెరిగిన ఎన్నికల హీట్
 • రెండు రోజుల పాటు విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశం
 • ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టిన ఈసీ
 • సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంపై దృష్టి
 • కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో తెలంగాణ నుంచి ఎందరు?
 • తెలంగాణ ఎన్నికల్లో ఓటేసి మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారా?
 • 2019లో ఏపీలో ఓటేసి మళ్లీ 2023 కల్లా తెలంగాణలో ఓటర్లుగా చేరారా?
 • ఏపీలో, తెలంగాణలో ఎంత మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి?
 • అక్కడా, ఇక్కడా ఓటర్లుగా ఉన్నవారిని సులభంగా గుర్తించే ప్రక్రియ ఏంటీ?
 • ఓటర్‌ కార్డుకు ఆధార్‌ కార్డును ఎలా అనుసంధానం చేద్దాం?
 • గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే డబుల్‌ ఓటర్ల అసలు సంగతి తేల్చలేమా?
 • పకడ్బందీ వ్యూహాన్ని తయారు చేస్తోన్న ఎన్నికల సంఘం

6:45 AM, డిసెంబర్‌ 27, 2023
కిం కర్తవ్యం.? నమ్మి మోసపోతున్నామా?

 • ఈనెల 28,29,30 తేదిలలో కాకినాడలో పవన్ కళ్యాణ్ బస
 • గోదావరి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా బలబలాలపై సమీక్ష
 • చంద్రబాబు ఇచ్చిన ఆఫర్‌ను నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు చెప్పనున్న పవన్‌
 • ఇప్పటికే జనసేనలో గోల గోల, ఇన్నాళ్లు కష్టపడితే 20 సీట్లేనా అని ఆవేదన
 • ముందు గొయ్యి, వెనకు నుయ్యి.. అన్నట్టుగా పవన్‌ పరిస్థితి
 • పార్టీ పరిస్థితి చూస్తే.. అంతంత మాత్రం..
 • చంద్రబాబు ఆఫర్‌ చూస్తే.. మరీ దారుణం
 • ఏం చేయాలి? బాబును ఎలా ఒప్పించాలి? పార్టీని ఎలా అంగీకరింపజేయాలి?

చంద్రబాబా? మజాకా? నమ్మితే నట్టేరే

 • 60  సీట్లు , 2.5 ఏళ్ళు సీఎం పదవి ఇవ్వకపోతే కాపులు ఓట్లు వేయరు
 • అదే విషయం ఇప్పటివరకు చంద్రబాబుకు చెబుతోన్న పవన్‌ కళ్యాణ్‌
 • ప్యాకేజీ తీసుకో.. తాకట్టు పెట్టుకో.. ఇదే సిద్ధాంతం వల్లిస్తోన్న  చంద్రబాబు
 • గ్రౌండ్‌లో పరిస్థితేంటీ? రెండు పార్టీల నేతలకు స్పష్టంగా తెలుసు
 • జనసేన అవసరం టీడీపీకి ఉంది కానీ టీడీపీ అవసరం జనసేనకు లేదు
 • 2019 ఎన్నికల్లో 10  వేల ఓట్లు పైన  వచ్చిన 60  సీట్లు జనసేనకు ఇవ్వాలి : కాపుల డిమాండ్‌
 • 60 సీట్లు ఇస్తే.. వారంలో  చంద్రబాబుకు మోడీ అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తానంటున్న పవన్
 • వివిధ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తోన్న జనసేన అనుకూల విశ్లేషకుడు చంద్రు శ్రీనివాస్ (కాపు)

పీకే - పీకే = చంద్రబాబు

 • పవన్ కళ్యాణ్‌ తీవ్ర అసంతృప్తిలో  ఉన్నాడా?
 • ఆ PK (ప్రశాంత్ కిషోర్) గురించి ఈ PK (పవన్ కళ్యాణ్) కు అసలు చెప్పలేదని పవన్ సన్నిహితులు మదనపడుతున్నారెందుకు?
 • (Pawan kept in the dark about hiring PK  - జాతీయ మీడియా, Dec 26 , 2023 )
 • బీజేపీని కాదని జైలు కు వెళ్లి మద్దతిచ్చినా కూడా కూరలో కరివేపాకేనా?
 • బాబు వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాలా?
 • ముందు ముందు మరిన్ని వెన్నుపోట్లు ఉంటాయి.. కాస్తా కాచుకుని ఉండండి
 • ఆక్ పాక్ కరివేపాక్ ..!!!
 • Note: ఒకవేళ అధికారం లోకి వస్తే డిప్యూటీ  సీఎం పదవి  కూడా ఇవ్వాలా వద్దా అనేది బాబు పొలిట్ బ్యూరో డిసైడ్ చేస్తాడు అని లోకేష్ చెప్పాడు , ఇచ్చేది కూడా 20  సీట్లే .!

Advertisement
 
Advertisement