AP Political Updates: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On Feb 11th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates Feb 11th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Sun, Feb 11 2024 7:06 AM

Andhra Pradesh Political Updates February 11th - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

6:50 PM, Feb 11, 2024
నారా లోకేష్‌ మాట్లాడేవన్నీ పనికి మాలిన మాటలు: మంత్రి సీదిరి అప్పలరాజు

  • చంద్రబాబు ఎన్ని టీచర్‌ జాబ్‌లు ఇచ్చారో సమాధానం చెప్పాలి
  • మాట్లాడే మాటల మీద లోకేష్‌కు అసలు కంట్రోల్‌ ఉందా? 
  • భోగాపురం ఎయిర్‌ పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి
  • అవగాహన లేకుండా లోకేష్‌ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు
  • రాష్ట్రంలో ప్రస్తుతం 5.6 లక్షల పర్మినెంట్‌ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
  • ఐదేళ్ల కాలంలో సీఎం జగన్‌ 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు
  • చంద్రబాబు కేవలం 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు
  • సీఎం జగన్‌ లక్షా 43 వేల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చారు
  • ఉద్యోగాల కల్పన గురించి లోకేష్‌ మాట్లాడటం హాస్యాస్పదం
  • లోకేష్‌, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు
  • చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయ్యలేదు
  • మీకు మంచి జరిగితేనే ఓటు వేయండనే దమ్మున్న నాయకుడు సీఎం జగన్‌
  • ఇలా అడిగే దమ్ము చంద్రబాబు, లోకేష్‌కు ఉందా?
  • లోకేష్‌ చేసేవన్నీ దొంగ పాదయాత్రలు
  • ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిన ఒక్క మంచిపని అయినా ఉందా?

6:16 PM, Feb 11, 2024

రేపు రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ

  • ఆనం మినహా మిగిలిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేల విచారణకు అవకాశం
  • ఉదయం ముగ్గురు వైఎస్సార్‌సీపీ రెబల్స్‌
  • మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబల్స్ ను విచారించనున్న స్పీకర్

6:13 PM, Feb 11, 2024
టీడీపీతో పొత్తుపై అమిత్ షా నిర్ణయిస్తారు : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

  • ఇప్పటి వరకు ఏదీ ఫైనల్ కాలేదు.
  • అన్నీ ఊహాగానాలు మాత్రమే
  • సీట్ల కేటాయింపు అంశం ఇంకా ప్రస్తావనకే రాలేదు
  • అన్నీ జాతీయపార్టీ చూసుకుంటుంది

6:03 PM, Feb 11, 2024
ఇచ్చాపురం: మరోసారి బయటపడ్డ  టీడీపీ, జనసేన విభేదాలు

  • లోకేష్‌ శంఖారావం సభకు రావొద్దంటూ జనసేన నేతలతో టీడీపీ నేతలు వాగ్వాదం
  • సభకు వస్తున్న జనసేన నేతలను అడ్డుకున్న టీడీపీ నాయకులు
  • టీడీపీ నేతల తీరుపై  తీవ్రంగా మండిపడుతున్న జనసేన నేతలు
  • దీంతో అవమానంతో తిరిగి వెళ్లిపోయిన జనసేన నేతలు
  • లోకేష్‌ సభలో జనసేన జెండాలు కనబడకూడదన్న టీడీపీ నేతలు
  •  సభలో కనిపించని జనసేన నేతలు, జెండాలు

1:00 PM, Feb 11, 2024
పొత్తులపై స్పందించిన పురంధేశ్వరి

  • బీజేపీ రాష్ట్ర  పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది.
  • ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు.
  • ముగ్గురు నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారు.
  • మా కార్యకర్తలకు పొత్తులపై ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు.
  • పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టాం.. పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయడం లేదు.
  • పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నాము.
  • పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయి.
  • పరిస్థితులను సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారు.
  • పార్టీ బలోపేతం కోసమే కార్యకర్తలు పని చేస్తున్నారు.

12:15 PM, Feb 11, 2024
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై బాలినేని సీరియస్‌
ఎల్లో మీడియాపై మాజీ మంత్రి బాలినేని ఆగ్రహం
ఇళ్ల స్థలాల్లో అవినీతి చేసినట్టు ఎల్లో మీడియా అబద్ధాలు.
తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నా బాలినేని
హద్దు దాటితే లక్ష మందితో మీ ఆఫీసులు ముట్టడిస్తామని వార్నింగ్‌

11:30 AM, Feb 11, 2024
జనసేన-టీడీపీలో కోల్డ్‌వార్‌..

  • ఏలూరు జనసేన, టీడీపీలో కోల్డ్ వార్
  • కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు..
  • టీడీపీ సిట్టింగ్ సీటుపై ఫోకస్ పెట్టిన వ్యాపార వేత్త నారా శేషు.
  • ఏలూరు టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న టీడీపీ, జనసేన ఇంఛార్జ్‌లు బడేటి చంటి, రెడ్డప్ప నాయుడు.
  • పునరాగమనం పేరుతో హోర్డింగులు ఏర్పాటుచేసిన వ్యాపారవేత్త నారా శేషు
  • తెరపైకి కొత్త వ్యక్తి రావడంతో టీడీపీ, జనసేన నేతలకు టెన్షన్‌
  • టికెట్ తనకే అంటూ ప్రచారం చేస్తున్న నారా శేషు.

10:30 AM, Feb 11, 2024
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదు: నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

  • భారతరత్న పీవీ నరసింహారావుకు ఇచ్చారు అంతకన్నా గొప్ప వ్యక్తి ఎన్టీరామారావుకి ఇవ్వాలి.
  • రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి గ్రామస్థాయికి రాజకీయాన్ని తీసుకెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్‌
  • ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదు.
  • కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి కూడా ఎన్టీఆర్‌కి భారతరత్న తేలేకపోయాడు.
  • చంద్రబాబు స్థాపించిన టీడీపీ నకిలీది.. ఒరిజినల్ పార్టీ ఎన్టీఆర్‌దే. 
     

10:00 AM, Feb 11, 2024
షర్మిలకు ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కౌంటర్‌

  • షర్మిలకి ప్రజల అజెండా లేదు .
  • సీఎం జగన్‌ను విమర్శించడమే అజెండాగా పెటుకున్నారు. 
  • వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఆమెను గౌరవిస్తున్నాం
  • మరీ శృతిమించి విమర్శలు చేస్తే వైఎస్సార్‌ అభిమానులు ఉపేక్షించరు
  • నర్సీపట్నంలో వైఎస్సార్‌ అభిమానులు ఎలా నిలదీశారో చూడండి
  • షర్మిల మీకు ఏపీ ప్రజలపై అభిమానం ఉంటే తెలంగాణ నుంచి రావలసిన విద్యుత్ బకాయిలు 6000 కోట్లు తీసుకురండి
  • ఉమ్మడి ఆస్తులను రేవంత్ రెడ్డిని అడిగి రప్పించండి
  • మీరు దివంగత నేత వైఎస్సార్‌ పరువు తీస్తున్నారు

9:30 AM, Feb 11, 2024
అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు: మంత్రి కారుమూరి

  • టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దోచుకున్నారు. 
  • చంద్రబాబు రెండు లక్షల కోట్ల ఆస్తిపరుడయ్యాడు. 
  • ఆయనను మూడుసార్లు సీఎంను చేసిన ప్రజలు పేదవాళ్లుగానే మిగిలిపోయారు. 
  • బాబుకు తెలిసిందంతా ప్రజల సొమ్ము దోచుకు, దాచుకో, పంచుకో

8:30 AM, Feb 11, 2024
ఫ్యాన్‌ బటన్‌ నొక్కండి ఇక చంద్రబాబు అవుట్‌

  • వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించండి
  • ఒకటి అసెంబ్లీకి, మరొకటి పార్లమెంట్‌కు ఫ్యాన​్‌ గుర్తుపై బటన్‌ నొక్కితే..
  • చంద్రముఖి బెడద ఇక అవుట్‌. 

07:30AM, Feb 11, 2024
‘నారాయణ’లో వడ్డీ దుకాణం!

  • టీడీపీ ఎన్నికల ఫండ్‌ కోసం నగదు వసూళ్లు...
  • రూ. 5 వడ్డీకి ప్రకాశం, నెల్లూరు జిల్లాల వారితో వ్యాపారం
  • నారాయణ కాలేజీలో 4 కౌంటర్లు.. 4  రోజుల్లోనే రూ. 650 కోట్లు వసూలు
  • రశీదులు కాకుండా టోకేన్లతో వ్యాపారం
  • డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లూ ఆరోపణలు 
  • అదే సమాచారంతో శుక్రవారం కళాశాలలో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు సోదాలు
     

07:00AM, Feb 11, 2024
నెలాఖరుకల్లా ఎన్నికల శిక్షణ పూర్తి చేయాలి

  • షెడ్యూల్‌ ప్రకంటించగానే ఎన్నికల నియమావళి అమలు
  •  ఈలోగానే అన్ని రకాల బృందాలకు శిక్షణ పూర్తవ్వాలి
  • 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులకు ఇంటివద్దే ఓటు వేసే అవకాశం
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా
     

06:30AM, Feb 11, 2024

జనసేనలో పొత్తుల చిచ్చు

  • పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న  అసంతృప్తి
  • అధినేత పవన్ తీరుపైనా శ్రేణుల్లోఅసహనం 
  • పొత్తులో జనసేన వాటా సీట్లను ఇంకా తేల్చకపోవడంతో మండిపాటు
  • చంద్రబాబు-పవన్‌ వైఖరి మీద జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం

Advertisement
 
Advertisement