AP Political Updates Feb 27th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Andhra Pradesh Political News Headlines In Telugu On Feb 27th Updates - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

09:59 PM, Feb 27th, 2024
మైలవరంలో శవరాజకీయాలు.. వాట్సాప్‌ వార్‌

 • టీడీపీలోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌
 • వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా వర్గం
 • తాజాగా.. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో వసంత పేరిట సర్వే
 • నోటా నొక్కాలంటూ వాట్సాప్‌లో ప్రచారం
 • ఇటీవలె పుల్లారావు అనే కార్యకర్త మృతి
 • ఉమాకు టికెట్‌ దక్కదన్న ఆవేదనతోనే చనిపోయాడంటూ ఉమా వర్గీయుల ప్రచారం
 • అనారోగ్యంతో చనిపోయాడంటున్న మరో వర్గం
 • శవరాజకీయాలు మొదటి నుంచి అలవాటేనంటూ మరో వర్గం వాట్సాప్‌లో కౌంటర్‌
 • పుల్లారావు తనయుడి ఆడియో రికార్డింగ్‌ పేరిట వాట్సాప్‌లో ఓ క్లిప్‌ వైరల్‌

 09:00 PM, Feb 27th, 2024
జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థికి సహకరించం: జనసేన

 • ఏపీ పొత్తు రాజకీయంలో కత్తులు దూస్తున్న టీడీపీ-జనసేన
 • టీడీపీకి జగ్గంపేట సీటు కేటాయింపుపై జనసేన అభ్యంతరం
 • గోకవరం మండలం అచ్చుతాపురంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పాఠం శెట్టి మీడియా సమావేశం
 • జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు సహకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన పాఠం శెట్టి సూర్యచంద్ర
 • జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ జగ్గంపేటలో పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామన్న పాఠం శెట్టి

06:45 PM, Feb 27th, 2024
YSRCP కీలక సమావేశంలో సీఎం జగన్‌ వ్యాఖ్యలు
 

►రేపటి నుంచి 45 రోజులపాటు కీలకం

►మనం చేసిన మంచి పనులు.. చేసే మంచిని ప్రజలకు చెప్పండి.. 

రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యం

►చంద్రబాబుకు విశ్వసనీయత లేదు

►2014లో చంద్రబాబు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలిచ్చారు

►సాధ్యపడని హామీలను కూడా మేనిఫెస్టోలో పెట్టారు

►అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు

►చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు నాకు ఇంకా గుర్తుంది

►రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, బంగారం లోన్లు తీరుస్తానన్నాడు

►సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశాడు

►అసలు అమలు సాధ్యం కాని హామీలు ఎలా ఇచ్చాడో చంద్రబాబుకే తెలియాలి

►ఒక హామీ ఒక నాయకుడు ఇచ్చాడంటే దానికి విశ్వసనీయత ఉండాలి

►తప్పుడు హామీలు ఎప్పుడు మనం ఇవ్వలేదు, ఇవ్వం కూడా

►మనం ఏది ఇవ్వగలమో.. అది చెబుతున్నాం

► 99 శాతం హామీలన్నింటిని నెరవేర్చాం

►దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ

► మోసం ఎప్పుడూ నిలబడదు

► 2019లో మనం అమలు చేయగలిగే హామీలిచ్చాం

►ప్రజలకు గుర్తుండిపోయేలా 2019 మేనిఫెస్టో తెచ్చాం

► రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 151 నియోజకవర్గాల్లో విజయం సాధించాం

►మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలరా? అని అడిగారు

►ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరతామని ఆనాడు చెప్పా

►ఇది చెప్పాం .. ఇది చేశాం అని ఇంటింటికి వెళ్లి చెప్పగలుగుతున్నాం

►మన పథకాలతో 87 శాతం పైచిలుకు కుటుంబాలకు సంక్షేమం అందిచాం

కుప్పంలో 93 శాతం కుటుంబాలకు మేలు చేశాం

►కుప్పంలో 87 వేల ఇళ్లు ఉంటే.. 83 వేల ఇళ్లకు మంచి జరిగింది

► కుప్పంలో 45 వేల కుటుంబాలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం

►రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ బటన్‌ నొక్కడం.. పేదల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం

► ఏకంగా రూ.2 లక్షల 55 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశాం

► మనం చేసిన మంచి చూసి ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి

►57 నెలల్లో పూర్తి ప్రక్షాళన జరిగింది.. సంక్షేమ పాలన అందించాం

► పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

గతంలో వెయ్యి రూపాయలు ఉన్న ఫించన్‌.. 3 వేలకు చేశాం

► పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందుబాటులోకి తెచ్చాం

► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం అందుబాటులోకి తెచ్చాం

► లంచాలు వివక్ష లేకుండా ప్రతీ ఇంటికి సంక్షేమం అందించాం

► నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం

►దిశ యాప్‌తో మహిళలకు భద్రత కల్పించాం 

►దిశ యాప్‌తో పోలీసులు త్వరగా స్పందిస్తున్నారు

►ఫోన్‌ చేస్తే చాలూ మహిళలకు రక్షణ దొరుకుతోంది

►ఆరోగ్యశ్రీని అత్యుత్తమ స్థాయిలో విస్తరించాం

► లంచాలకు, వివక్షలకు తావు లేకుండా సంక్షేమ పాలన అందించాం

► ఇవాళ జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు

► ఓసీల్లో కూడా నిరుపేదలు ఉన్నారు

► పేదలు ఓవైపు ఉంటే.. పెత్తందారులు మరోవైపు ఉన్నారు

► జగన్‌ ఎప్పుడూ పేదల వైపే ఉంటాడు

►జగన్‌ గెలిస్తే పేదవాడికి న్యాయం జరుగుతుంది

►మీ జగన్‌ ఉంటే పేదవాడు బాగుపడతాడు

►జగన్‌ ఉంటే లంచాలు లేకుండా బటన్‌లు కొనసాగుతాయి

► జగన్‌ ఉంటేనే విలేజ్‌ క్లినిక్‌లు పని చేస్తాయి

►జగన్‌ రాకుంటే మళ్లీ జన్మభూమిలదే రాజ్యమవుతుంది

►45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి

►వైఎస్సార్‌సీపీలో టికెట్ల ఎంపిక దాదాపు పూర్తైంది

► ఇప్పుడు ప్రకటించిన పేర్లే దాదాపుగా ఫైనల్‌ లిస్ట్‌

దాదాపుగా టికెట్లు కన్‌ఫామ్‌ చేసినట్లే

►సంక్షేమం కొనసాగాలంటే జగనే సీఎంగా ఉండాలి

►జగన్‌ చేయగలిగింది మాత్రమే చెబుతాడు

►చంద్రబాబు మాత్రం ఎలాంటి అబద్ధం అయినా చెబుతాడు

►చంద్రబాబు మాత్రం తన అవసరాల కోసం ఎవరినైనా మోసం చేస్తాడు

►ప్రతీ ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ఓటర్లలోకి వెళ్లండి

►ప్రతీ ఒక్కరూ ప్రతీ ఇంటికి వెళ్లి జరిగిన మంచిని చెప్పండి

►జరిగిన మంచిని బాగా చెప్పగలిగితేనే విజయం సాధిస్తాం

►నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశా

►ఇప్పుడు మీ వంతు..చేసిన మంచిని ఓటర్లకు చెప్పండి

►గతంలో 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఈసారి 175కి 175 స్థానాలు గెలవాల్సిందే

►25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే

►పేదవాడు బాగుపడాలంటే వైఎస్సార్సీపీ రావాల్సిందే

05:58 PM, Feb 27th, 2024
కరవమంటే కప్పకు.. విడవమంటే పాముకు..!

 • నిడదవోలు, రాజమండ్రి రూరల్ టికెట్ల పై సస్పెన్స్ కంటిన్యూ
 • రెండు, మూడు రోజుల్లో అధికారికంగా అభ్యర్థుల ప్రకటన 
 • కడియపులంకలో జనసైనికులతో కందుల దుర్గేష్ భేటీ 
 • రాజమండ్రి రూరల్ సీటు గోరంట్ల బుచ్చయ్య కు ఖరారు 
 • తనకెందుకు ఇవ్వడం లేదని కందుల దుర్గేష్‌ ఆగ్రహం
 • నిడదవోలులో పోటీ చేయాలని కందుల దుర్గేష్ కు జనసేన సూచన 
 • నిడదవోలు సీటును జనసేన కు ఇవ్వడం పై టీడీపీ శ్రేణుల ఆగ్రహం 
 • ఇలాగయితే ఓటు బదిలీ పక్కనబెట్టి మొత్తానికి మొత్తం మునుగుతామంటున్న రెండు పార్టీల నేతలు

05:20 PM, Feb 27th, 2024
నేను నిష్పక్షపాతంగా వ్యవహరించా: స్పీకర్‌ తమ్మినేని సీతారాం

 • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా
 • నా నిర్ణయంలో సీఎం జగన్‌ ప్రమేయం లేదు
 • వైఎస్సార్‌సీపీలో చేరిన వారిపైనా చర్యలు తీసుకున్నా
   

04:30 PM, Feb 27th, 2024
ముగిసిన లోక్‌సభ బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం

 • కోర్‌ కమిటీ సమావేశంలో క్యాడర్‌కు దశా, దిశా నిర్దేశం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌
 • పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించిన రాజ్‌నాథ్‌సింగ్‌
 • విజయవాడ కోర్‌ కమిటీ సమావేశం అనంతరం ఏలూరులో జరిగే కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమాని బయల్దేరిన రాజ్‌నాథ్‌సింగ్‌

04:00 PM, Feb 27th, 2024
అంబేద్కర్ కోనసీమ జిల్లా:

అంబాజీపేటలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాభాస

 • మహాసేన రాజేష్‌కి టికెట్ కేటాయించడంపై ఆగ్రహించిన జనసైనికులు
 • రాజేష్ గో బ్యాక్ అంటూ హారీష్ మాధుర్ని ముట్టడించిన జనసైనికులు
 •  హారీష్ మాధుర్ కారును ద్వంసం చేసిన కార్యకర్తలు
   

03:30 PM, Feb 27th, 2024

పశ్చిమగోదావరిజిల్లా: 

ఇప్పుడు నా మద్దతు అవసరమా?: ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు

 • 20 సంవత్సరాలు టీడీపీ పార్టీకి కష్టపడిన వ్యక్తిని, మాజీ ఎమ్మెల్యే నన్ను పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించి తీసి పారేసిన వైనం బాధ కలిగించింది.
 • స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు గత రెండు సంవత్సరముల నుండి నన్ను అవమానపరిచి, నా పేరు ఉచ్చరించిన వారిని బెదిరించి,అదరించిన వ్యక్తికి ఇప్పుడు నా మద్దతు అవసరమా.
 • రేపు తాడేపల్లిగూడెంలో జరగబోయే టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం లేదు.
 • నిన్న జరిగిన స్థానికంగా జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశానికి కూడా నాకు ఆహ్వానం లేదు.

03:10 PM, Feb 27th, 2024

సింహపురిలో ఏం చేద్దాం?

 • కరకట్ట ఇంట్లో చంద్రబాబుతో మాజీమంత్రి నారాయణ భేటీ
 • మార్చి 2న చంద్రబాబు నెల్లూరు పర్యటనపై భేటీలో చర్చ
 • అసలు నెల్లూరులో ఎన్ని గెలుస్తాం?
 • వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని పార్టీలోకి తీసుకొస్తే.. సైకిల్‌కు పెరిగే బలమెంత?
 • జనసేనతో పొత్తు వల్ల అసలుకే మోసమా?
 • అసలు ఓటు మార్పిడి జరిగే అవకాశముంటుందా?
 • సీట్ల సర్ధుబాటుపై పవన్‌తో చర్చలు సరే, క్షేత్రస్థాయిలో పరిస్థితేంటీ?
 • వేర్వేరు అంశాలపై నారాయణతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చలు
 • నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారోననేది మాకు తెలీదు : నారాయణ
 • సీట్ల విషయంలో చంద్రబాబు ఆదేశాలను పాటిస్తాం : నారాయణ
 • బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయి : నారాయణ
 • చంద్రబాబు స్పష్టత ఇస్తేనే అందరికి తెలుస్తుంది : మాజీమంత్రి నారాయణ

02:50 PM, Feb 27th, 2024

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: 

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరనున్న మాజీ  మంత్రి గొల్లపల్లి సూర్యారావు

 • రాజోలు టికెట్ ఆశించి తీవ్రంగా భంగపడిన గొల్లపల్లి సూర్యరావు
 • రాజోలు జనసేనకు కేటాయించడంతో పి గన్నవరం టికెట్ అయినా ఇస్తారని ఎదురుచూపులు 
 • పి. గన్నవరం టికెట్ ను మహాసేన రాజేష్‌కి ప్రకటించడంతో పార్టీ తీరును నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేసిన గొల్లపల్లి
 • సీఎం జగన్ సమక్షంలో ఇవాళ సాయంత్రం 5:30 కు వైఎస్సార్‌సీపీలో మాజీ మంత్రి గొల్లపల్లి చేరతారని చెబుతున్న ఆయన అనుచరులు

02:44 PM, Feb 27th, 2024
స్కిల్‌ కేసు విచారణ రేపటికి వాయిదా

 • చంద్రబాబు నాయుడి స్కిల్‌ స్కామ్‌ కేసులో ఇవాళ సాగిన విచారణ
 • ఏసీబీ కోర్టులో స్కిల్ స్కామ్ విచారణ రేపటికి వాయిదా
 • స్కిల్ స్కామ్ లో ఇంకా ఛార్జి షీట్ లో దాఖలు చేయలేదన్న అదనపు పీపీ
 • విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు

02:36 PM, Feb 27th, 2024
సింహం ఒకవైపు.. గుంపు మరో వైపు

 • వైసీపీని సింగిల్ గా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు
 • పవన్ అందుకే పొత్తులతో వస్తున్నారు
 • మాకు పొత్తుబలం లేకున్నా ప్రజాబలం ఉంది : జక్కంపూడి రాజా

02:33 PM, Feb 27th, 2024
సైకిల్‌ కోసం గ్లాసు పగలగొడతారా?

 • రాజమండ్రి రూరల్ టికెట్ కోసం దుర్గేష్ వర్గం పట్టు
 • కందుల దుర్గేష్ కి మద్దతుగా జనసేన కార్యకర్తల ర్యాలీ
 • కడియం దేవిచౌక్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ
 • టికెట్ విషయంపై పవన్ కళ్యాణ్‌ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి
 • లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్న అనుచరులు

02:30 PM, Feb 27th, 2024
కోనసీమలో టీడీపీకి ఎదురుదెబ్బ

 • రాజోలులో సైకిల్‌కు ఎదురుగాలి
 • టీడీపీని వీడనున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
 • పార్టీ మారాలని గొల్లపల్లి సూర్యారావు నిర్ణయం
 • రాజోలు టికెట్ జనసేన కు కేటాయించడంతో సూర్యారావు కినుక
 • అధిష్టానం పట్టించుకోకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయం
 • రాజోలు నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు

02: 26 PM, Feb 27th, 2024
ఏసీబీ కోర్డులో స్కిల్ స్కామ్ విచారణ

 • ఏ2 నిందితుడు లక్ష్మీనారాయణ పిటీషన్ పై సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు పీపీ జ్యోతి
 • స్కిల్ స్కామ్ కేసులో అప్రూవర్‌గా మారడానికి చంద్రకాంత్ షా పిటీషన్ వేశారన్న సీఐడీ తరపు అదనపు పీపీ
 • పిటీషన్‌లో చంద్రకాంత్ షా జతచేసిన డాక్యుమెంట్లు లక్ష్మీనారాయణకి ఇవ్వాల్సిన అవసరం లేదన్న సీఐడీ అదనపు పీపీ
 • ఈ దశలో చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలలో భాగమే లక్ష్మీనారాయణ పిటీషన్ అన్న అదనపు పీపీ
 • చంద్రకాంత్ షా పిటీషన్‌లో జత చేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఏ2 నిందితుడు, మాజీ ఐఎఎస్ లక్ష్మీనారాయణ పిటిషన్ చెల్లదని సీఐడీ తరపు వాదనలు
 • ఏసీబీ కోర్టులో సీఐడీ తరపున వాదనలు కొనసాగిస్తున్న అదనపు పీపీ జ్యోతి
 • గత వారం లక్ష్మీనారాయణ పిటీషన్‌పై వాదనలు వినిపించిన ఆయన తరపు న్యాయవాదులు
 • బోగస్ ఇన్వాయిస్‌లతో నిధులు స్వాహా చేశారని ఆధారాలతో సహా ఇప్పటికే పిటీషన్‌లో పేర్కొన్న చంద్రకాంత్ షా
 • స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఏ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా పేర్కొన్న చంద్రకాంత్ షా
 • స్కిల్ కేసులో ఏ- 26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా
 • డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్‌లని ఇవ్వాలని వారు కోరినట్లు పేర్కొన్న చంద్రకాంత్ షా
 • ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్‌లు, డిజైన్ టెక్‌కి రెండు బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చానన్న చంద్రకాంత్ షా
 • బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చినందుకు 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని వాంగ్మూలం
 • అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చంద్రకాంత్ షా పిటీషన్
 • ఆ 65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తింపు
   

01:45 PM, Feb 27th, 2024

విశాఖ: 

ఏపీలో పొత్తుల గురించి ప్రస్తావించని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

 • ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుంది
 • బీజేపీ ఒకరోజు అధికారంలోకి వస్తుంది.

01:06PM, Feb 27th, 2024

కర్నూలు జిల్లా:

ఎమ్మిగనూరు టీడీపీలో విభేదాలు

 • బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, డాక్టర్ మాచాని సోమనాథ్ వర్గీయుల మధ్య ఫ్లెక్సీల వివాదం 
 • గంజిల్లా,బైలుప్పల అగ్రహారంలలో సోమనాథ్ ఫ్లెక్సీలను చించిన  జయనాగేశ్వర్‌రెడ్డి వర్గీయుల
   

01:03PM, Feb 27th, 2024

పశ్చిమగోదావరి జిల్లా: 

ఉండి టీడీపీలో చల్లారని అసమ్మతి సెగలు

 • ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుకు పరాభవం
 • భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే రామరాజు
 • రామరాజుతో మాట్లాడేందుకు నిరాకరించిన శివరామరాజు
 • అధిష్టానం తనకు సీటు కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు
 • రామరాజుకు సపోర్ట్‌ చేసేది లేదంటూ తేల్చి చెప్పిన శివరామరాజు
 • శివరామరాజు ఆఫీసు నుండి వెళ్లిపోయిన రామరాజు

12:44PM, Feb 27th, 2024
టీడీపీ అభ్యర్థి కొలకపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలపై మండిపడ్డ తిరువూరు మున్సిపల్‌ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు

 • ఎన్టీఆర్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ విగ్రహలను తొలగిస్తాం అంటూ కొలకపూడి శ్రీనివాస్‌ మాట్లాడటం అతని అహంకారానికి నిదర్శనం
 • తిరువూరు నియోజకవర్గం అంటేనే ప్రశాంతతకు మారుపేరు
 • ఎన్నికలప్పుడే పార్టీలు, తర్వాత అందరూ సోదర భావంతోనే ఉంటారు
 • ఇక్కడ రాగద్వేషాలకు తావు లేదు, ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదు
 • ప్రజాప్రతినిధులుగా కోలికపూడి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

12:40PM, Feb 27th, 2024

14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఉత్తరాంధ్రకు ఏం చేశాడు:  మంత్రి అప్పలరాజు

 • చంద్రబాబు శ్రీకాకుళంలో రా.. కదలిరా సభ పెట్టి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానంటున్నాడు
 • 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకు ఏం చేశాడు
 • నీ పాలనలో అభివృద్ధిలో వెనకబడ్డమేగాని తెలివితేటల్లో వెనకబడలేదు
 • సీఎం జగన్‌.. ఉత్తరాంధ్రకు  పరిపాలన రాజధాని ఇస్తే దాన్ని కోర్టుకు వెళ్లి అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు
 • ఉద్దానాన్ని స్మశానంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు
 • ఉద్దానంలో చావులకు కారణం చంద్రబాబు నాయుడు
 • ఉద్దానంలో ప్రజలు చచ్చిపోతుంటే ప్రైవేట్ హాస్పిటల్‌కి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తావా
 • ఉత్తరాంధ్రకు 14 సంవత్సరాల లో ఏం చేశావు చంద్రబాబు
 • ఐదేళ్లలో మీరేం చేసామంటే నిమిషంలో 100 పనులు చెప్తా
 • సభల్లో నువ్వు మాట్లాడుతుంటే జనం వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తే ప్రజలు ఎంతగా నిన్ను నమ్ముతున్నారో అర్ధం అయిపోతుంది
 • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు నాయకుడు ఎట్లా అవుతాడని నువ్వు అడుగుతున్నావు
 • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిజంగా పేదలకు నాయకుడే
 • చంద్రబాబు నాయుడు పెత్తందారులకు నాయకుడు
 • అందుకే మన ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల లిస్టులో  22 మంది నీ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇచ్చావు

12:20PM, Feb 27th, 2024

టీడీపీ-జనసేనది పొత్తు కాదు.. చిత్తు: మంత్రి అంబటి

 • బోరున విలపిస్తున్న జనసేన నేతల్ని చూస్తే జాలేస్తుంది
 • ఈ పొత్తు వల్ల క్యాష్‌ ట్రాన్స్‌ఫర్‌ మాత్రమే జరిగింది
 • మా క్యాస్ట్‌ ఓట్లు ట్రాన్స్‌ఫర్‌ కాలేదు

12:01PM, Feb 27th, 2024

పవన్‌ తీరుపై జనసేన కార్యకర్తల ఆందోళన

 • రాజమండ్రి రూరల్‌ స్థానాన్ని టీడీపీకి కేటాయించిన చంద్రబాబు
 • రాజమండ్రి రూరల్‌ స్థానం కోసం పోటీపడిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు దుర్గేష్‌
 • దుర్గేష్‌ను నిడదవోలు వెళ్లాలని సూచించిన పవన్‌ కల్యాణ్‌
 • కందుల దుర్గేష్‌కు రాజమండ్రి రూరల్‌లోనే పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతూ కడియం గ్రామం నుండి రాజమండ్రి డీలక్స్‌ సెంటర్‌ వరకూ శాంతియుత పాదయాత్ర చేస్తున్న దుర్గేష్‌ అభిమానులు

11:29AM, Feb 27th, 2024

మా ప్రభుత్వం పేదవాడికి మంచి చేయాలన్న ఆలోచనతో పని చేస్తుంది: మంత్రి వేణుగోపాల్ 

 • పేద వాళ్ళందరికీ మంచి చేస్తుంది
 • కానీ ప్రతిపక్షాలకు మాత్రం పేదవాళ్ళకి మంచి జరగకూడదన్న ఆలోచన చేస్తున్నారు
 • పవన్ కళ్యాణ్ తన సీటును తానే ప్రకటించుకోలేని స్ధితిలో ఉన్నాడు
 • తెలుగుదేశం- జనసేన పొత్తు చిత్తయింది

11:05 AM, Feb 27th, 2024
మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

 • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం
 • సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, అసెంబ్లీ పరిశీలకులు
 • ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్న సీఎం జగన్‌
   

11:02 AM, Feb 27th, 2024

తూర్పు గోదావరి జిల్లా : 

టీడీపీలో ఆగని అసంతృప్తి జ్వాలలు

 • నిడదవోలు నియోజకవర్గం టీడీపీలో ఆగని అసంతృప్తి జ్వాలలు
 • బూరుగుపల్లి శేషారావుకు టికెట్ ఇవ్వకుంటే సామూహిక రాజీనామాలు చేస్తామంటూ టీడీపీ నేతలు అల్టిమేటం  జారీ
 • చంద్రబాబు తీరు మార్చుకోవాలని అధిష్టానంపై తెలుగు తమ్ముళ్ల ఫైర్.
 •  సమావేశమైన నాలుగు మండలాల టీడీపీ నేతలు
 • శేషారావుకి టికెట్ కేటాయించుకుంటే రెండు రోజుల్లో భవిష్యత్ కార్య చరణ ప్రకటిస్తామని వెల్లడి 
 • జనసేనకు సీటు కేటాయిస్తే అధినేతపై యుద్ధం ప్రకటిస్తామంటూ నేతల హెచ్చరిక
 • కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి ఎన్నికల బరిలో దిగుతారన్న ప్రచారం టీడీపీ నేతలకు మింగుడు పడని వైనం

10:50 AM, Feb 27th, 2024

తూర్పుగోదావరి జిల్లా: 

లోకేష్‌ను చంద్రబాబును ఉద్ధరించడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడా?: ఎంపీ భరత్‌

 • బీజేపీకి ఒక పర్సెంట్ కూడా ఓట్ పర్సంటేజ్ లేదు
 • కాస్త కూస్తో జనాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలేదు.. చంద్రబాబు పల్లకి మోస్తున్నాడు
 • తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఎందుకు ఓట్లు వేయాలి... జనానికి ఏం చేశారు
 •  మహిళలను, రైతులను మోసం చేశారు
 • నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారు
 • మా ఐదేళ్ల కాలంలో మేము ఏమి అభివృద్ధి చేశామో... మీరేం అభివృద్ధి చేశారో పోల్చో చూసుకోండి
 • టీడీపీ హయాంలో కాల్ మనీ కేసులు ఉండేవి... ఆత్మహత్యలు బలవన్ మరణాలు ఉండేవి వడ్డీ వ్యాపారులు సామాన్యులను పీడించారు
 • సీఎం జగన్ హయాంలోనూ క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరిగింది
 • సీఎం జగన్ మహిళల చేతుల్లో డబ్బు పెట్టారు
 • చంద్రబాబు వచ్చి కొత్తగా ఒరగబెట్టేదేమీ లేదు
 • కనీసం అంగన్వాడి సెంటర్ కి వెళ్లి చూసిన పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఇప్పుడు కనిపిస్తుంది
 • గతంలో సరైన న్యూట్రిషన్ అందక పిల్లలు కూడా ఎంతో బాధపడ్డారు
 • చంద్రబాబు పాలనను సీఎం జగన్ పాలన పోల్చి చూసుకోండి... ఏది మంచో, ఏది చెడో  మీకే తెలుస్తుంది 
 • స్వతంత్రం వచ్చిన తర్వాత ద బెస్ట్ అనుకున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రమే.
 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇంకా న్యాయం చేయాలి
 • కందుల దుర్గేష్ గురించి చెప్పాలి.. అంటే ...రైట్ పర్సన్ అండ్ రాంగ్ పార్టీ అని చెప్పొచ్చు
 • గతంలో రాజమండ్రికి మురళీమోహన్ ఏం చేశారు

10:30 AM, Feb 27th, 2024

చిత్తూరు టీడీపీలో స్వరం పెంచిన బలిజ టీడీపీ నేతలు

 • టీడీపీ బలిజల్ని బలిపశువుల్ని చేసింది.. అంటూ చిత్తూరు నగరంలో ర్యాలీ నిర్వహణ
 • 30 ఏళ్లుగా టీడీపీ లో పనిచేస్తున్న బలిజల్ని కాదని, బెంగుళూరు నుంచి అభ్యర్థి తీసుకు వచ్చి పోటీ పెడతారా అంటూ మండిపడ్డ టీడీపీ నేత కాజూరు బాలాజీ
 • టీడీపీ కోసం కష్టపడి కరోనాలో  ప్రాణాలు కోల్పోయిన కటారి ప్రవీణ్ కుటుంబంకు అన్యాయం చేశారని మండిపాటు
 • బలిజ నాయకులు టిటిడి మాజీ చైర్మన్ డికే ఆదికేశవులు నాయుడు కుటుంబం నుంచి తేజస్విని, చైతన్యలను విస్మరించారు అంటూ ఆగ్రహం
 • చిత్తూరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన గురజాల జగన్‌కు బలిజలు సత్తా ఏంటో చూపిస్తామంటు  బలిజ సంఘం నిన్న నిరసన ర్యాలీ
 • ఈరోజు భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేకంగా సమావేశం కానున్న బలిజ టీడీపీ నేతలు, బలిజ సంఘం నాయకులు

10:24 AM, Feb 27th, 2024

రాష్ట్రాభివృద్ధిపై చర్చకు సిద్ధం: దేవినేని అవినాష్‌

 • కళ్లుండి చూడలేని కబోదిలా టీడీపీ నేతల పరిస్థితి
 • విజయవాడ ఈస్ట్‌లోనే రూ. 650 కోట్ల పైబడి అభివృద్ధి జరిగింది
 • చేసిన అభివృద్ధి చెపుకోలేక జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న టీడీపీ నేతలు
 • రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీ నేతలతో చర్చకు నేను సిద్ధం
 • స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రామ్మోహన్, మాజీ  జడ్పీటీసీ అనురాధ జరుగుతున్న అభివృద్ధిని చూడలేకే ఎల్లో మీడియా ద్వారా విషపు ప్రచారం చేస్తున్నారు
 • విద్యా వ్యవస్థలో నాడు నేడు ద్వారా సమూల మార్పులు తీసుకువచ్చిన జగన్ ప్రభుత్వం
 • పేద పిల్లల సైతం ఇంగ్లీష్ విద్యను అభ్యసించాలన్నదే జగన్ కోరిక
 • ఇప్పటికైనా మేల్కొని టీడీపీ నేతలు  విష ప్రచారం మానకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు

9:58 AM, Feb 27th, 2024
టీడీపీలో అసమ్మతి సెగలు

 • అనకాపల్లి: మాడుగుల నియోజకవర్గం టీడీపీలో బయటపడిన అసమ్మతి
 • రామానాయుడుకు మద్దతుగా టీడీపీ నేతలు సమావేశం
 • రామానాయుడుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని తీర్మానం
 • మాడుగుల సీటు కోసం రామానాయుడు, పివిజీ కుమార్, పైలా ప్రసాద్ పోటీ
 • రామానాయుడుకు సీటు ఇవ్వకపోతే తమ దారి తమదే అంటున్న టీడీపీ నేతలు

9:01 AM, Feb 27th, 2024
టీడీపీలో ఆగ్రహ జ్వాల

 • చంద్రబాబు నమ్మించి మోసగించాడని సీనియర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కార్యకర్తల మండిపాటు
 • ఉండవల్లిలో బాబు ఇంటి ముందు తంబళ్లపల్లి టీడీపీ నేతల నిరసన 
 • శంకర్‌యాదవ్‌కు టికెట్‌ ఇవ్వాలంటూ పెట్రోల్‌ పోసుకునేందుకు యత్నం
 • కోడుమూరులో టీడీపీ నేత ఆకెపోగు ఆత్మహత్యాయత్నం
 • ఎర్రచందనం స్మగ్లర్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తారా?: నగరి నేతల ఆగ్రహం 
 • కాకినాడ రూరల్‌లో తాడోపేడో అంటున్న తమ్ముళ్లు.. కార్యకర్త ఆత్మహత్యాయత్నం
 • నిడదవోలులో దుర్గేష్‌ను ఒప్పుకోం.. శేషారావుకు టికెట్‌ ఇవ్వాల్సిందే
 • పార్టీ కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నా: మాదినేని
 • నరసరావుపేటలో యరపతినేని కోసం బీసీ నేత చదలవాడ బలి
 • కోట్లు ఖర్చుపెడితే రాజానగరంలో బొడ్డుకు రిక్తహస్తం
 • జనసేనకు టికెట్‌ ఇస్తే సహకరించబోమన్న బుద్ధప్రసాద్‌ అనుచరులు

8:23 AM, Feb 27th, 2024
బాబు లీల.. కేడర్‌ గోల

 • టీడీపీలో ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారో తెలియక గందరగోళం 
 • అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేస్తున్న హడావుడితో టీడీపీ కేడర్‌లో అయోమయం
 • తమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రోజుకో నేత పేరు..
 • అదీ సంబంధం లేని ప్రాంతాలకు చెందిన వారి పేర్లు వస్తుండటంతో నిర్ఘాంతపోతున్న కేడర్‌
 • టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఇప్పటికే పలుచోట్ల ఆందోళనలు
 • మిగిలిన సీట్లలో అభ్యర్థులను ఖరారు చే­సేందుకు చంద్రబాబు కసరత్తు
 • కేడర్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
 • ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారో ఎందుకు అలా చేస్తు­న్నారో అర్థంకాక తలలు పట్టుకుంటున్న పార్టీ నేతలు, కార్యకర్తలు 

8:04 AM, Feb 27th, 2024
చంద్రబాబు కితకితలు

 • రుషి కొండ మీద ఋషులు ఉండేవారు పవిత్ర స్థలం అది
 • అంటే అప్పట్లో  వెయ్యి ఏళ్ల క్రితం బాబు సెల్ ఫోన్‌లో ఋషులతో మాట్లాడేవాడులే 
 • వాస్తవానికి ఎన్టీఆర్ హయాంలో రుషికొండపై 1984–89లో 48 వేల చదరపు అడుగులు స్థలంలో నిర్మాణాలు చేశారు
 • 1984లో సీఎం ఎన్టీఆర్ రుషికొండ మీద కట్టడాలు మొదలెట్టి దిగిపోయిన 1989 నాటికి 12 బ్లాకులు నిర్మించారు
 • అంటే రుషికొండను తొలిచింది, నిర్మాణాల కోసం అక్కడ చెట్లను నరికివేసింది టీడీపీ ప్రభుత్వమే
 • తర్వాత  బాబు  హయాములో 2002లో మరిన్ని నిర్మాణాలు చేపట్టారు. 
 • గత ప్రభుత్వంలో నిర్మించిన హెలిప్యాడ్‌ ఉంది
 • పాత భవనాలు ఆధునికతకు పనికిరావని 
 • అత్యాధునిక పర్యాటక సౌకర్యాలతో రుషికొండ ప్రాజెక్టు చేపట్టిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్
 • గతంలో చంద్రబాబు క్యాంపు కార్యాలయాలకు భారీగా ప్రజాధనం వృథా 
 • ఫైవ్‌ స్టార్‌ బాబు
 • ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన నివాసం, క్యాంపు కార్యాలయంగా హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ ఫైవ్‌ స్టార్‌ 
 • హోటల్‌ను ప్రకటించి మరీ సర్కారు ఖజానా నుంచి ఏకంగా రూ.30 కోట్లు చెల్లించారు
 • ఆ తరువాత అద్దె ఇంటిలోకి వెళ్లి ఆ ఇంటిని సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు. ఆ ఇంటికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేశారు.
 • తొలుత హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో హెచ్‌ బ్లాక్‌ను సీఎం కార్యాలయంగా ప్రకటించి రూ. 7 కోట్లతో మరమ్మతులు చేశారు
 • ఆ తరువాత వాస్తు పేరుతో ఎల్‌ బ్లాక్‌ను సీఎం కార్యాలయంగా ప్రకటించి అక్కడ మరమ్మతులు, ఫర్నిచర్, హంగుల కోసం ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు చేశారు
 • హైదరాబాద్‌లోనే లేక్‌వ్యూ గెస్ట్‌ హౌన్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి రూ.10 కోట్లు ఖర్చు చేశారు
 • ఆ తరువాత ఓటుకు కోట్లు కేసులో ఆయన గుట్టు రట్టవడంతో హఠాత్తుగా హైదరాబాద్‌ వదిలేసి రాత్రికిరాత్రి విజయవాడ వచ్చేశారు
 • విజయవాడ ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి రూ.42 కోట్లతో మార్పులు చేశారు
 • చివరికి కృష్ణా కరకట్ట ఎక్కి లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు
 • ఇవన్నీ కూడా అధికారికంగా జీవోల ద్వారానే  ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు దుబారా చేసినవే
 • హైదరాబాద్‌ మదీనాగూడలోని చంద్రబాబు సొంత  ఫామ్‌ హౌస్‌లో హెలిప్యాడ్, రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు
 • మదీనాగూడతో పాటు జూబ్లిహిల్స్‌లో  విలాసవంతమైన ఇంద్రభవనాలు నిర్మించుకున్న చంద్రబాబు
 • వాటిలో ఇంటీరీయర్‌ కోసం సీఆర్‌డీఏ నిధులను మళ్లించారు

7:41 AM, Feb 27th, 2024
చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

 • ఎక్కువ మంది పిల్లల్ని కంటే లాభం
 • రా.. కదలిరా.. సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు 
 • ఈ ప్రభుత్వం సలహాదారులకు రూ.680 కోట్లు ఖర్చు చేసిందని విమర్శ 
 • జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్‌ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణ 

7:28 AM, Feb 27th, 2024
పవన్‌ ప్రకటించిన మొట్టమొదటి సీటు  లాక్కున్న చంద్రబాబు

 • ఆరిమిల్లి రాధాకృష్ణ కోసం జనసేనకి ఎర్త్‌ పెట్టిన చంద్రబాబు
 • విడివాడ రామచంద్రరావుకి హ్యాండ్‌ ఇచ్చేసిన పవన్‌ కల్యాణ్‌
 • వారాహి యాత్రలో క్షమాపణ చెప్పి సీటు ప్రకటించిన పవన్‌
 • ఇప్పుడు మళ్లీ రెండోసారి హ్యాండ్‌ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌
 • చంద్రబాబు ఎలా చెప్తే అలా తలాడిస్తున్న పవన్‌ కల్యాణ్‌
 • భీమిలి సీటు కూడా మళ్లీ టీడీపీకే
 • గంటా కోసం జనసేన సీటు లాక్కంటున్నచంద్రబాబు
 • భీమిలి సీటులో పంచకర్ల సందీప్‌కి షాక్‌ ఇవ్వనున్న పవన్‌
 • చంద్రబాబు ఏం చెప్పినా అంగీకరిస్తున్న పవన్‌
 • పవన్‌ పూర్తిగా పార్టీని చంద్రబాబు చేతుల్లో పెట్టేశారని జనసేన నేతల మండిపాటు

7:15 AM, Feb 27th, 2024
పవన్‌.. జీ హుజూర్‌..

 • చంద్రబాబు ఎన్ని సీట్లిచ్చినా, ఏ సీట్లిచ్చినా పవన్‌ జీ హుజూర్‌ 
 • జనసేన జుట్టును పూర్తిగా చేతిలోకి తీసుకున్న టీడీపీ 
 • గత ఎన్నికల్లో పవన్‌ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన సీట్లూ టీడీపీకే.. అప్పట్లో జనసేనకు అరకొర ఓట్లు వచ్చిన సీట్లే ఇప్పుడు ఆ పార్టీకి 
 • 2019 ఎన్నికల్లో 15 స్థానాల్లో జనసేనకు 30 వేలకు పైగా ఓట్లు 
 • వాటిలో ఒకే ఒక్కటి ఇప్పుడు జనసేనకు... పి.గన్నవరం వంటి సీట్లూ హుళక్కే 
 • విజయవాడలోనూ జనసేన స్థావరాల్లోకి టీడీపీ చొరబాటు.. ఇక్కడ జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చిన రెండు సీట్లూ టీడీపీకే 
 • పవన్‌ కల్యాణ్‌ తీరుపై రగిలిపోతున్న పార్టీ వర్గాలు.. ఇలాగైతే ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌ సాధ్యం కాదని బాహాటంగానే వ్యాఖ్యలు 

7:05 AM, Feb 27th, 2024
గ్లాస్‌కు గుడ్ బై

 • పశ్చిమ గోదావరి: తణుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో విడివాడ రామచంద్రరావు
 • పెంటపాడు మండలం అలంపురంలో నాదెండ్ల మనోహర్ పర్యటన
 • నాదెండ్లను కలవకుండానే వెళ్లిపోయిన విడివాడ

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top