అప్పుడలా.. ఇప్పు‘డీలా’..
పెద్దపల్లిరూరల్: పల్లెను పాలించాలనే ఆశతోనో.. నాయకుడిగా గుర్తింపు పొందాలనే తపనతోనో యువకులు, రాజకీయ పార్టీల నేతలు పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టం పరీక్షించుకుంటుంటారు. ప్రత్యర్థులపై విజయం సాధించాలనే కసితో ప్రచారం కోసం, ఓటర్లను తమవైపు తిప్పు కోవడం కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. ప్రచార పర్వంలో వెంట తిరిగిన చోటామోట నేతలు, పోలింగ్, ఓట్లలెక్కింపు సందర్భంగా ఏజెంట్లు తదితర ముఖ్యుల కోసం విందులు, వినోదాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు.
ఆశపెట్టి.. జారిపాయే..
ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఫలితాలు వెలువడగా.. కొద్దిఓట్ల తేడాతో పరాజయం పాలై.. కోలుకోలేని వారు కొందరుంటారు. చేతిచమురు వదిలినా.. చేతికి పదవి దక్కలేదన్న బాధను దిగమింగుకుని ఐదేళ్లపాటు నిరీక్షిస్తారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో గత పరాజయం సానుభూతితో ఎన్నిక ల్లో గట్టెకొచ్చనే ఆశలో ఉన్న పరాజితులకు ఈసారి రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. ఈసారి పంచాయతీ స ర్పంచ్‌గా అవకాశం దక్కితే గతఎన్నికల్లో పరాజయం పాలై కూడగట్టుకున్న సానుభూతి కలిసొచ్చి విజ యం సాధించే అవకాశాలు ఉండే వని మదనపడుతున్నారు.
ఉపసర్పంచ్ పదవిపై గురి..
గ్రామ ప్రథమ పౌరులుగా ఉండాల నే ఆలోచన ఉన్నా.. రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో కొందరు వార్డు సభ్యులుగా పోటీపడి గెలుపొంది మిగతా వార్డు సభ్యుల సహకారంతో ఉపసర్పంచ్ పదవి దక్కించుకునేందుకు సిద్ధపడుతున్నారు. గతఎన్నికల్లో పెద్దపల్లి మండ లం అందుగులపల్లి పంచాయతీ నుంచి వార్డు స భ్యులుగా పోటీకి దిగిన దంపతులు పొలవేన కు మార్, కేతమ్మ విజయం సాధించారు. ఈసారి ఓ వార్డులో రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఒకవా ర్డు నుంచే పోటీ చేస్తున్నానని కుమార్ తెలిపారు. ఇదే పంచాయతీ ఉపసర్పంచ్‌గా వ్యవహరించిన తలారి స్వప్న, ఆమెభర్త సాగర్ ప్రస్తుత వార్డు సభ్యులుగా పోటీకి దిగుతున్నట్లు పేర్కొన్నారు.
కార్యదర్శులపైనే ‘పంచాయతీ’ భారం
పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల వ్యయం కార్యదర్శులపైనే పడుతోంది. పంచాయతీ ఖజానాల్లో ని ధులు నిండుకున్నాయి. పాలకవర్గాలూ లేవు. దీంతో పల్లెలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈనేపథ్యంలోనే స్థానిక ఎన్నికలు జోరందుకోవడంతో నిధులు అవసరమయ్యాయి. జిల్లాలో మూ డు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈనేపథ్యంలోనే నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
మూడు విడతల్లో పోలింగ్
జిల్లాలోని 13 మండలాల్లో 263 గ్రామపంచాయతీలు, 2,432 వార్డులు ఉన్నాయి. వీటిలో నామినేషన్ల స్వీకరణకు 85 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు, పోలింగ్, ఫలితాలు వెల్లడి వరకు ఇలా.. వారంపాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో పాలుపంచుకునే అధికారులు, సిబ్బందికి భోజనం, అల్పాహారం, టీ అందించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం పంచాయతీ కార్యదర్శులకు తలకుమించిన భారమవుతోంది. ఇప్పటికే రెండేళ్లుగా పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఎన్నికల ఖర్చును జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తుందని పలువురు కార్యదర్శులు వాపోతున్నారు. ఈ విషయమై డీపీవో వీరబుచ్చయ్యను సంప్రదించగా.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి టీఏ, డీఏ అందిస్తున్నామన్నారు. మానవీయ కోణంలోనే భోజనం ఏర్పాటు చేయాలని కార్యదర్శులకు సూచించామని ఆయన వివరించారు.
పకడ్బందీగా ‘స్థానిక’ ఎన్నికలు
పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన పంచా యతీ పోలింగ్ కేంద్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ ను సోమవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ, నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది విధు లు నిర్వర్తించాలన్నారు. నామినేషన్ వివరాలు టీ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నా రు. మండల కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లు త్వరితగతిన పంపించాలని ఆయన సూచించారు. శ్రీపా ద ఎస్డీఆర్, జాతీయ రహదారి భూసేకరణపై ని ర్వహించి సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, పెండింగ్ భూసేకరణను వారంలో పూర్తిచేయాలన్నారు. మంచిర్యాల– వరంగల్ మధ్య నాలుగులేన్ల గ్రీ న్‌ఫీల్డ్ హైవే, మంథనిలోని శ్రీపాద ఎస్డీఆర్ నిర్మా ణానికి భూసేకరణ పూర్తిచేయాలని సూచించారు. డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు.


