ఎయిర్‌పోర్టుకు ముందడుగు | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టుకు ముందడుగు

Dec 2 2025 7:44 AM | Updated on Dec 2 2025 7:44 AM

ఎయిర్

ఎయిర్‌పోర్టుకు ముందడుగు

గోదావరిఖని: అంతర్గాంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు మ రో ముందడుగు పడినట్లు పె ద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. సివిల్‌ ఏవియేషన్‌ మంత్రి రామ్మోహన్‌నాయుడుకు చేసిన విన్నపం మేరకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు ఈనెల 3న, లే దా 4వ తేదీన అంతర్గాం ప్రాంతంలో భూ స ర్వే చేస్తుందని పేర్కొన్నారు. ప్రీ–ఫిజిబిలిటీ స్ట డీ పూర్తయ్యాక భూసేకరణ, తుది నిర్ణయాలకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ స్థాపనతో రామగుండం, సింగరేణి ప్రాంతం, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లా లు, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయ ని ఆయన వివరించారు.

కలెక్టరేట్‌ ఏవోగా ప్రకాశ్‌

పెద్దపల్లి: కలెక్టరేట్‌ పరిపాలన అధికారి(ఏ వో) గా బండి ప్రకాశ్‌ సోమవారం బాధ్యతలు స్వీక రించారు. అనంతరం కలెక్టర్‌ కోయ శ్రీహర్షను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

మద్యపానంపై నిషేధాజ్ఞలు

గోదావరిఖని: బహిరంగ ప్రదేశాల్లో మద్య పానంపై నిషేదాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీ స్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు. మహిళలు, పౌరుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌ లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ఈ నెలాఖరు వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. డీజేలకూ అనుమతిలేదన్నారు. ధర్నాలు, ర్యా లీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు ని ర్వహించకూడదని, అత్యవసరమైతే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.

లైఫ్‌సైన్సెస్‌ మాక్‌టెస్ట్‌

పెద్దపల్లిరూరల్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో సోమవారం టీఎస్‌ సెట్‌ (స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) లైఫ్‌సైన్సెస్‌ పరీక్ష మాక్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించిందని ప్రిన్సిపాల్‌ లక్ష్మీనర్సయ్య తెలిపారు. ప్రభుత్వం త్వరలో టెట్‌ ని ర్వహిస్తుందని, విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు మాక్‌టెస్ట్‌ నిర్వహించినట్లు వివరించారు. టెస్ట్‌లో ఉత్తీర్ణులైతే డిగ్రీ కాలేజీల్లో అ ధ్యాపక, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెస ర్‌ ఉద్యోగాలకు అర్హత సాధిస్తారని పేర్కొన్నా రు. టెస్ట్‌ నిర్వహించిన అధ్యాపకుడు తిరుపతిను ప్రిన్సిపాల్‌ తదితరులు అభినందించారు.

ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి

పెద్దపల్లి: ఎయిడ్స్‌పై అందరికీ అవగాహన ఉండాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. ఎ యిడ్స్‌ అవగాహన దినోత్సవ ర్యాలీని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సోమవారం ప్రారంభించారు. సిరి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. యువత డ్రగ్స్‌కు బానిసలు కావొద్దన్నారు. అనంతరం హెచ్‌ఐవీ నియంత్రణలో అత్యుత్తమ సేవలు అందించిన పలువురి కి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రోగ్రాం అధికారులు సుధాకర్‌రెడ్డి, రాజమౌళి, నీలిమ, ప్రతినిధులు సత్యనారాయణ, రాంకిషన్‌, రాజగోపాల్‌, బిక్షపతి, లావణ్య, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, శంకర్‌, రవి, సత్యానందం పాల్గొన్నారు.

నేటినుంచి వైజ్ఞానిక ప్రదర్శనలు

జ్యోతినగర్‌(రామగుండం): జిల్లాస్థాయి బాల ల, బాలికల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్‌ అవార్డు– మనాక్‌ ఎగ్జిబిషన్‌లు మంగళవారం ప్రారంభిస్తామని డీఈవో శారద తెలిపారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో మూడురోజుల పాటు ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. పాఠశాలలో చేపట్టిన ఏర్పాట్లను సోమవారం ఆమె పరిశీలించారు. గత విద్యాసంవత్సరంలో ఎంపికై న 106 ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌ మనాక్‌ ప్రాజెక్టుల విద్యార్థులు సైతం ఇందులో పాల్గొంటారన్నారు. జిల్లా సైన్స్‌ఫేర్‌కు హాజరుకావాలని ఎన్టీపీసీ ఈడీ చందన్‌ కుమార్‌ సామంతను ఆమె ఆహ్వానించారు. డీసీఈబీ కార్యదర్శి హన్మంతు, ఎంఈవోలు మల్లేశం, సురేందర్‌, విమల తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టుకు ముందడుగు 1
1/4

ఎయిర్‌పోర్టుకు ముందడుగు

ఎయిర్‌పోర్టుకు ముందడుగు 2
2/4

ఎయిర్‌పోర్టుకు ముందడుగు

ఎయిర్‌పోర్టుకు ముందడుగు 3
3/4

ఎయిర్‌పోర్టుకు ముందడుగు

ఎయిర్‌పోర్టుకు ముందడుగు 4
4/4

ఎయిర్‌పోర్టుకు ముందడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement