పనితీరు మెచ్చి కాంగ్రెస్‌లోకి..
పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/ఓదెల: సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలనతీరు మెచ్చి పలు పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నార ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాసులపల్లికి చెందిన సింగిల్‌విండో మాజీ వైస్‌చైర్మన్ అలువాల దామోదర్‌రెడ్డి, వేల్పుల మనోహర్, భూంరెడ్డి, రాజిరెడ్డి, శంకర్, మల్లేశం, అంజయ్య, మహేందర్, సతీశ్ తదితర నాయకులు సోమవా రం కాంగ్రెస్‌లో చేరగా.. ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎలిగేడు మండలం శివపల్లి, ఓదెల మండలం రూపునారాయణపేటలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించేందుకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. పెద్దపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూరమల్లారెడ్డి, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, నాయకులు చిలుక సతీశ్, మూల ప్రేంసాగర్‌రెడ్డి, ఆళ్ల సుమన్‌రెడ్డి, బైరి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


