సుల్తానాబాద్‌ అభివృద్ధికి రూ.15కోట్లు | - | Sakshi
Sakshi News home page

సుల్తానాబాద్‌ అభివృద్ధికి రూ.15కోట్లు

Nov 2 2025 8:13 AM | Updated on Nov 2 2025 8:15 AM

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ పట్ట ణ అభివృద్ధికి మరో రూ.15 కోట్లు మంజూరు చేయించా మని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. పదేళ్ల బీ ఆర్‌ఎస్‌ పాలనలో పట్టణ అ భివృద్ధి వెనుకబడిపోయిందని, పట్టణ ప్రజల రుణం తీర్చుకునేందుకు పక్కా కార్యాచరణతో నిధుల మంజూరుకు కృషి చేస్తున్నామన్నారు. అంతర్గత రోడ్లు, జంక్షన్లు, డ్రైనేజీలు, కల్వర్టు లు, విలీన గ్రామాల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు

ధర్మారం(ధర్మపురి): నందిమేడారం జూనియ ర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు నందిమేడారం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి తెలిపారు. గ్రామ శివారులోని సర్వే నంబరు 865లో రెండెకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తు పెద్దపల్లి ఆర్‌డీవో ఉత్తర్వులు జారీచేశారన్నారు. నందిమేడారం అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ విన్నపం మేర కు ప్రతిపాదనలు పంపించిన ప్రధాన న్యాయమూర్తి సునీత.. నందిమేడారం సివిల్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి సరిత, మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు బార్‌ అసోసియేషన్‌ తరఫున లింగారెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఎకరాకు రూ.40వేల పరిహారం చెల్లించాలి

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: భారీవర్షాలతో పంట లు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల పరిహారం చెల్లించాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్‌ చేశారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీని శనివారం కలెక్టరేట్‌లో ఆయన కలుసుకుని ఒక వినతిప త్రం అందజేశారు. జిల్లావ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం నష్టంపై అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, బెజ్జంకి దిలీప్‌ కుమార్‌, మహేందర్‌ యాదవ్‌, రాజన్న, వెంకటస్వామి, ప్రదీప్‌ కుమార్‌, కందుల శ్రీనివాస్‌, కొల్లూరి కుమార్‌, సంపత్‌ దేవేందర్‌ పటేల్‌, మహంతా కృష్ణ, వెంకటేశ్‌, వెంకటకృష్ణ, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

గోదావరి మహాహారతి పోస్టర్‌ ఆవిష్కరణ

రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ సమీప గోదావరి నదీతీరంలో ఈనెల 6న చేపట్టే గోదావరి మహాహారతి కార్యక్రమ ప్రచార వాల్‌పోస్టర్‌ను వేడుకల నిర్వహణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో శనివా రం ఆవిష్కరించారు. కార్తీకమాసంలో నదుల్లో దీపాలు వదిలితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి మహిళలు శతవసంతాలు సౌభాగ్యవంతులుగా ఉంటారని వెంకటరమణ తెలిపారు. నాయ కులు కంద లోకనాథం, మాడ ప్రభాకర్‌రెడ్డి, ఒల్లెపు మల్లేశం, మల్లారెడ్డి, అంజిబాబు, రాజేందర్‌, మల్లిక్‌, హరీశ్‌, రాజు తదితరులు ఉన్నారు.

‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో

రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోందని నీటిపారుదలశాఖ అధికారు లు శనివారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.66 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని తెలిపారు. 13 గేట్లు ఎత్తి 1.35 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న గోదావరిలోకి వదులుతున్నామని అధికారులు పేర్కొన్నారు.

సుల్తానాబాద్‌ అభివృద్ధికి రూ.15కోట్లు 1
1/3

సుల్తానాబాద్‌ అభివృద్ధికి రూ.15కోట్లు

సుల్తానాబాద్‌ అభివృద్ధికి రూ.15కోట్లు 2
2/3

సుల్తానాబాద్‌ అభివృద్ధికి రూ.15కోట్లు

సుల్తానాబాద్‌ అభివృద్ధికి రూ.15కోట్లు 3
3/3

సుల్తానాబాద్‌ అభివృద్ధికి రూ.15కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement