
15న ప్రత్యేక లోక్ అదాలత్
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: రాజీకి అర్హమైన కేసుల ప రిష్కారం కోసం ఈనెల 15న ప్రత్యేక లోక్ అథాలత్ నిర్వహిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచా ల సునీత తెలి పారు. ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి స్వప్నరాణితో కలిసి జిల్లా కోర్టులో శనివారం సమీక్షించారు. ఇంటి గొడవలు, భూతగాదాలు, ప్రమాదాలు, భార్యాభర్తల వివాదా లు, చెక్‌బౌన్స్ వంటి కేసులను లోక్ అదాలత్‌లో ప రిష్కరించుకునేవీలుందన్నారు. ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో రాజీ చేసుకుంటే ఒకేసారి పరిహారం అందిస్తారని తెలిపారు. మూడేళ్లలోపు శిక్ష ప డే క్రిమినల్ కేసులు కూడా రాజీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని నందిమేడారం, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని, రామగుండం కోర్టుల్లో నిర్వహించే ప్రత్యేక లోక్ అథాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి సూచించారు.