
పోలీస్‌స్టేషన్ తనిఖీ
రామగుండం: అంతర్గాం పోలీస్‌స్టేషన్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణాలోని రికార్డులు పరిశీలించారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి ఎక్కువగా నమోదవుతున్న కేసుల గురించి ఆరా తీశారు. పరిసరాలు, భౌగోళిక పరిస్థితులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పెద్దచెరువుకు బుంగ
ముత్తారం(మంథని): పారుపల్లి పెద్దచెరువు తూ ము వద్ద బుంగ ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూముకు సమీపంలో బుంగ ఏర్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుంగపెద్దగా మారితే కట్ట తెగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అధికారులు తక్షణమే మరమ్మతు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

పోలీస్‌స్టేషన్ తనిఖీ