టెక్ హఫీజ్
తన వద్ద పెద్దగా డబ్బు లేదు.. ఎవరి సపోర్ట్ కూడా లేదు.. కానీ, పెద్ద ప్రణాళిక ఉంది.. అంతకుమించి పట్టుదల ఉంది.. దాంతోనే రోజూ కొత్త విషయాలు నేర్చుకొని.. ఆ అంశాలనే ప్రజలతో పంచుకున్నాడు. వంద రూపాయలతో మొదలైన యూట్యూబర్ జీవితం నెలకు రూ.3లక్షల వరకు చేరింది. ఇలా సంపాదిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు. ప్రపంచమే గుప్పిట్లో చేరిన ఈరోజుల్లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్. మొదట్లో హఫీజ్ వీడియోలకు కావలిసినంత వీక్షకులు రాకపోగా, ఇదెవరు చూస్తారని స్నేహితులు ఎగతాలి చేశారు. అయినా నిరాశ పడలేదు. క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూనే వచ్చారు. తన కృషికి ఫలితంగా గోల్డెన్ వీసా వరించింది. ప్రజలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడమే కాదు.. ప్రజలతో పంచుకోవడం విశేషం. – గోదావరిఖని
– వివరాలు 8లోu
టెక్ హఫీజ్


