మద్యం మత్తులో డ్రైవింగ్
సీరియస్‌గా పరిగణిస్తున్న పోలీస్‌శాఖ
ఒకసారి పట్టుబడితే రూ.2వేల జరిమానా
రెండోసారి దొరికితే మూడురోజుల జైలు శిక్ష
మూడోసారి దొరికితే ఏడురోజుల వరకు కటకటాలు
గోదావరిఖని: మద్యం మత్తుతో వాహనాలు నడిపేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని ఓ పోలీసు అఽధికా రి ఇటీవల వాఖ్యానించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్‌రెడ్డి కూడా హెచ్చరించారు. మత్తెక్కితే కిక్కు దించుతామంటూ రామగుండం పోలీస్ కమిషరేట్‌లోని పోలీసులు చె బుతున్నారు. ఈమేరకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు.
35 శాతం ప్రమాదాలకు మద్యమే కారణం..
రామగుండం కమిషరేట్ పరిధిలో ప్రతీరోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 35 శాతం నుంచి 40 శాతం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌తోనేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఇలాంటివారిలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఒక సారి దొరికితే కేసు నమోదు చేస్తున్నారు. అయినా మార్పురావడం లేదు. మళ్లీ అదేపద్ధతిన రెండోసారి చిక్కి జైలుపాలవుతున్నారు. వీరిసంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఈ ఒక్క ఏడాదిలోనే మద్యం తాగి వాహనాలు నడుపుతూ 25 మంది పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. అయినా చాలామందిలో అస్సలు మార్పురావడం లేదు.
పెరుగుతున్న ప్రమాదాలు..
మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. మద్యం మత్తులో అతివేగంతో డ్రైవింగ్ చేయడం ద్వారా వాహనం అదుపులోకి రాక ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతివేగంతో జరిగిన ప్రమాదాల్లో మృతులు, గాయపడివారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో పోలీసు శాఖ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను సీరియస్‌గా తీసుకుంది.
తనిఖీలు ముమ్మరం..
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సివిల్, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాత్రివేళడ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు పెంచుతున్నారు. బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో కేసు నమోదు చేస్తున్నారు. తర్వాత కోర్టులో హాజరు పర్చుతున్నారు. ఒకసారి పోలీసులకు పట్టుబడితే.. రూ.2వేల జరిమానా విధిస్తున్నారు. రెండోసారి దొరికితే మూడు రోజుల జైలు, మూడోసారి పట్టుబడితే నాలు గురోజు జైలు శిక్ష విధించి కరీంనగర్ జైలుకు తర లిస్తున్నారు. ఇలా ఎక్కువసార్లు పట్టుబడిన వారిలో టూవీలర్, ఆటో, లారీ, కారు, ట్రాక్టర్ డ్రైవర్లు అధికంగా ఉంటున్నారు.
కేసుల వివరాలు
ఏడాది కేసులు చార్జిషీట్ జైలు ఫైన్, జైలు జరిమానా(రూ.లలో)
2023 1,759 1,734 13 7 9,92,432
2024 2,553 2,518 20 12 34,25,105
2025 2,775 2,579 25 0 43,36,473
మొత్తం 7,087 6,831 58 19 87,53,010


