368 ఎకరాల్లోనే వరికి నష్టం
జిల్లాలో ఇటీవల కురిసిన వానకు పంటలకు పెద్దగా నష్టమేమీ జరగలేదని ప్రాథమిక సర్వేలో తేలింది. ఇప్పటివరకు 264 మంది రైతులకు చెందిన 368 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. నేలవాలిన వరిపైరును కట్టలుగా కట్టాలని ఏఈవోలు రైతులకు సూచిస్తున్నారు. అలా చేస్తే దిగుబడి కూడా బాగానే వస్తుంది.
– శ్రీనివాస్, డీఏవో
ఐదురోజులు వరికోతలు వద్దు
జిల్లాలో మరోఐదు రోజుల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. రైతులు.. వచ్చే ఐదురోజుల పాటు వరి కోతలు చేపట్టవద్దు. ఇప్పటికే కోసి ధాన్యం రాశులు పోసిన రైతులు.. వడ్లు తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలి. తేమశాతం 17కు మించకుండా చూసుకోవాలి.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్
368 ఎకరాల్లోనే వరికి నష్టం


