శిశు మరణాల కట్టడికి చర్యలు తీసుకోవాలి
పెద్దపల్లి: జిల్లాలో శిశు మరణాల కట్టడికి చర్యలు చే పట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వాణిశ్రీ సూచించారు. శిశు మరణాలపై నియంత్రణకు తీసు కోవాల్సిన చర్యలపై తన కార్యాలయంలో శుక్రవా రం సమీక్షించారు. ఎన్‌సీడీ సర్వేపై చర్చించారు. డి సెంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు జిల్లా లో 26 శిశు మరణాలు సంభవించాయని, ఇందులో బరువు తక్కువ, నెలలు నిండక ముందే పుట్టిన తదితర కేటగిరీల మరణాల కేసులు ఎంపికచేసి కారణాలపై సమీక్షించాలన్నారు. ఎన్‌సీడీ సర్వే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయనివారిపై చర్య తీసుకుంటామని అన్నారు. ప్రోగ్రాం అధికారులు కిరణ్ కు మార్, రాజమౌళి డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాము లు, వైద్యులు రవీందర్, మీరజ్ ఫాతిమా ఉన్నారు.


