
సింగరేణి పీఆర్వోకు జర్నలిజంలో డాక్టరేట్
గోదావరిఖని: హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారి(పీఆర్‌ఓ)గా పనిచేస్తున్న శ్రీరాముల శ్రీకాంత్ నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి డాక్టరేట్ స్వీకరించారు. ‘సాంఘిక, రాజకీయ ఉద్యమాల్లో సామాజిక మాధ్యమాల పాత్ర, తెలంగాణ ఉద్యమంపై కేసు స్టడీ’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక అధ్యయనానికి డాక్టరేట్ లభించింది. తెలంగాణ ఉద్యమంలో యువత అగ్రభాగంలో నిలిచింది. ఉద్యమ ఆకాంక్షను జనబహుళ్యంలోకి తీసుకెళ్లడం, సామాన్యుల భావవ్యక్తీకరణకు సోషల్ మీడియా దోహదపడింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈవిధంగా సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందని వివరిస్తూ శ్రీకాంత్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగుల్లో పీహెచ్‌డీ సాధించిన వారు అతికొద్ది మందే ఉన్నారు. ఈ నేప థ్యంలోనే శ్రీకాంత్‌ను సింగరేణి సీఎండీ బలరాం గురువారం అభినందించారు. ఈడీ(కోల్ మూ మెంట్) ఎస్‌డీఎం సుభాని, జీఎం(మార్కెటింగ్) టి.శ్రీనివాస్, సింగరేణి భవన్ అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

సింగరేణి పీఆర్వోకు జర్నలిజంలో డాక్టరేట్