
కొడుకు చనిపోయాడనే బెంగతో తండ్రి ఆత్మహత్య
ముత్తారం(మంథని): చేతికి అందిన కొడుకు చనిపోయాడనే బెంగతో మారం రాజిరెడ్డి(55) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ సంఘటన మండల కేంద్రంలోని కాసార్లగడ్డలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. మారం రాజిరెడ్డి వ్యవసా య కూలీగా పని చేసుకుంటున్నాడు. వచ్చేఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా డు. అయితే, ఇతడి కొడుకు రమేశ్‌రెడ్డి గతేడాది పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. అప్పట్నుంచి తీవ్రమనోవేదనతో ఉంటున్నాడు. తన కన్నకొడుకు మృతి చెందడం బాధి స్తోందని తన భార్యకు తరచూ చెప్తూ ఏడ్చేవా డు. ఈక్రమంలో కొడుకు లేడనే ఆవేదనతో ఈ నెల 15న రాజిరెడ్డి పురుగుల మందు తాగి ఇంట్లోనే పడుకున్నాడు. కూలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన భార్య పద్మ నిద్రలేపేందుకు యత్నించగా.. తాను పురుగుల మందు తాగానని చెప్పా డు. సమీప బంధువులకు సమాచారం అందించిన పద్మ వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
ఎన్టీపీసీ సీఎండీ పదవీకాలం పొడిగింపు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) గుర్దీప్‌సింగ్‌ను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మళ్లీ నియమించాలనే విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను క్యా బినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ)ఆమోదించింది. ఆయన ఉ ద్యోగ విరమణ తేదీ తర్వాత ఏడాదిపాటు(01.08.2025 నుంచి 31.07.2026 వరకు) పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ డిప్యూ టీ డైరెక్టర్ విజయ్‌కుమార్ దారక్ ఉత్తర్వులను మంత్రిత్వ శాఖ సెక్రటరీ పంకజ్ అగర్వాల్ విడుదల చేసినట్లు సమాచారం.
రాజీమార్గమే మేలు
గోదావరిఖనిటౌన్: ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవడమే మేలని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ సూచించారు. స్థానిక న్యాయస్థానంలో బుధవారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తి మాట్లాడారు.