ఊర్ల మధ్య మట్టి పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

ఊర్ల మధ్య మట్టి పంచాయితీ

Published Sat, Jun 22 2024 11:48 PM | Last Updated on Sat, Jun 22 2024 11:48 PM

ఊర్ల మధ్య మట్టి పంచాయితీ

● రాస్తారోకో ఉద్రిక్తం

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): గంగారం గ్రామంలోని కోణాలకుంట చెరువు మట్టి తవ్వకాలు రెండు గ్రామాల్లో చిచ్చుపెట్టింది. మట్టి తవ్వకాలపై శుక్రవారం ప్రారంభించిన నిరసన కార్యక్రమాలను శనివారం కూడా రైతులు కొనసాగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గంగారం గ్రామానికి చెందిన ముదిరాజ్‌ కులస్తులు తమ కులసంఘ భవన నిర్మాణం కోసం కోణాలకుంట చెరువు నుంచి శుక్రవారం జేసీబీలు ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలించారు. సమాచారం అందుకున్న ఊశన్నపల్లె గ్రామ రైతులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. శనివావారం ఊశన్నపల్లె గ్రామానికి చెందిన గేదెలు మేతకోసం అడవికి వెళ్తుండగా గంగారం గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఊశన్నపల్లె గ్రామస్తులు రాస్తారోకు చేశారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాల్వశ్రీరాంపూర్‌– సుల్తానాబాద్‌ – పెద్దపల్లి మార్గంలో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎస్సై ఓంకార్‌ యాదవ్‌.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమస్య పరిష్కరించుకోవాలని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement