ఖరీదైన వైద్యం చేయించుకోలేక నిరుపేద మృతి | Sakshi
Sakshi News home page

Article ad after second para

ఖరీదైన వైద్యం చేయించుకోలేక నిరుపేద మృతి

Published Wed, Nov 15 2023 1:32 AM

లక్ష్మణ్‌ (ఫైల్‌)
 - Sakshi

చందుర్తి(వేములవాడ): ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఓ నిరుపేద వ్యక్తి మృతిచెందిన ఘటన చందుర్తి మండలం కట్టలింగంపేటలో మంగళవారం విషాదం నింపింది. గ్రామస్తు ల కథనం ప్రకారం.. కట్టలింగంపేటకు చెందిన మల్లారపు లక్ష్మణ్‌(55) నెల రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యా ధితో బాధపడుతున్నాడు. లక్ష్మణ్‌ను వైద్యులు పరీక్షించి రెండు కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్‌ చేయించుకోవాలని సూచించారు. నాలుగైదుసార్లు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీలో డయాలసిస్‌ చేయించుకున్నాడు. కూలీ పని చేసుకుని జీవించే ఈ కుటుంబానికి రవాణా ఖర్చులే భారంగా మారాయి. మంగళవారం డయాలసిస్‌ చేయించుకునేందుకు కరీంనగర్‌ వెళ్లాడు. చికిత్స అందుతున్న క్రమంలోనే లక్ష్మణ్‌ మృతిచెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య మల్లవ్వ, కూతురు మౌనిక, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

కరెంట్‌ షాక్‌తో గృహిణి..

సిరిసిల్లటౌన్‌: కరెంట్‌ షాక్‌తో ఓ గృహిణి మృతిచెందిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌కు చెందిన ఉడుత లావణ్య(40) మంగళవారం ఉదయం బట్టలు ఉతికి ఇంటి ముందర వైరుపై ఆరవేస్తుండగా కరెంట్‌ వైర్లకు ఉన్న జేవైరు తగిలి షాక్‌తో మృతిచెందింది. మృతురాలి మేనమామ అన్నల్‌దాస్‌ నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ ఉపేందర్‌ తెలిపారు.

గేదె దాడిలో ఒకరు..

వీణవంక(హుజూరాబాద్‌): ఇప్పలపల్లికి చెందిన ముదిగంటి రాజిరెడ్డి(50) తన గేదె దాడిలో మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజిరెడ్డి మంగళవారం తన ఇంటి సమీపంలో గేదెకు వరి గడ్డి వేస్తున్నా డు. ఆ సమయంలో అది ఒక్కసారిగా కొమ్ములతో పొడవడంతో పక్కనున్న బండరాళ్లపై ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆిసిఫ్‌ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement