ఎన్నికల ప్రచార ఆటోలు బంద్‌ | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచార ఆటోలు బంద్‌

Published Sun, Nov 12 2023 12:50 AM

- - Sakshi

గోదావరిఖని: తమపై దాడులు చేస్తూ ఆటోల అద్దాలు ధ్వంసం చేస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల ప్రచారం ఆటోలు శనివారం నిలిపివేశారు. వంద ఆటోలకుపైగా నిలిపివేసి స్థానిక జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌కు తరలించారు. కొందరు చేస్తున్న దాడులతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు నాయకులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి ప్రచారంలోకి దిగారు.

విషజ్వరంతో బాలుడి మృతి

బోయినపల్లి(చొప్పదండి): విషజ్వరంతో మండలంలోని గుండన్నపల్లికి చెందిన బాలుడు గుంట అభినయ్‌(14) శుక్రవారం రాత్రి మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గుంట మమత–పోచమల్లు దంపతుల కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అభినయ్‌ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌ హాస్టల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికొచ్చాడు. జ్వరం రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ తరలించగా కోమలోకి వెళ్లి, శుక్రవారం రాత్రి మృతిచెందాడు. గ్రామంలో విశాదచాయలు అలుముకున్నాయి.

నిలిచిన ప్రచార ఆటోలు
1/1

నిలిచిన ప్రచార ఆటోలు

Advertisement
Advertisement