
గోదావరిఖనిటౌన్(రామగుండం): గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మేడ చక్రపాణి, ప్రధాన కార్యదర్శిగా బోడ సమ్మయ్య ఎన్నికయ్యారు. కోర్టు ఆవరణలో శుక్రవారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 199 ఓట్లకు 184 పోలైనట్టు ఎన్నికల అధికారి కె.శ్రీనివాసరావు తెలిపారు. అధ్యక్ష పదవికి మేడ చక్రపాణి, వేల్పుల మురళీధర్‌యాదవ్, సీహెచ్.శైలజ పోటీ చేయగా చక్రపాణి 94 ఓట్లతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా గుల్ల రమేశ్, జనరల్ సెక్రటరీగా బోడ సమ్మయ్య, జాయింట్ సెక్రటరీగా ప్రదీప్‌కుమార్, ట్రెజరర్‌గా ఎండీ ఉమర్, స్పోర్ట్స్ అండ్ కల్చరర్‌గా రంగు శ్రీనివాస్, లైబ్రరీ సెక్రటరీగా ముచ్చకుర్తి కుమారస్వామి, లేడీ రిప్రజంటేటివ్‌గా మహేశ్వరం రాగిణి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా బాస అనురాధ, గుర్రం నారాయణ, జి.ప్రకాశ్, ఆస్మా సుల్తానా, మాట్ల భానుకృష్ణ, పులిపాక రాజ్‌కుమార్, పెట్టం వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.
అర్హులకే డబుల్ బెడ్రూం ఇళ్లు
ఓదెల(పెద్దపల్లి): అర్హులకు మాత్రమే డబుల్‌బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఆర్డీవో వెంకటమాదవరావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కునారపు రేణుకదేవి అధ్యక్షతన డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు లిస్ట్ అవుట్‌పై సమీక్షా సమావేశం జరిగింది. మండలంలో 150 మందిని మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం 22 గ్రామాల నుంచి 139 మందిని ఇళ్లు లేని వారిని గుర్తించినట్లు వివరించారు. ఇంకా ఎవరైనా ఇల్లు లేనివారు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు.