అంతా నాటకీయతే! | - | Sakshi
Sakshi News home page

అంతా నాటకీయతే!

May 23 2026 12:40 AM | Updated on May 23 2026 12:40 AM

శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026 శాసీ్త్రయత లేదు.. అంతా నాటకీయతే! ● వార్డుల విభజన అస్తవ్యస్తం ● ప్రజలు, పార్టీల అభిప్రాయం తెలుసుకోకుండానే జాబితా తయారు ● ఓ వర్గానికి మేలు చేసేలా ఉన్నాయన్న ఆరోపణలు విడదీశారిలా.. మార్చుతారా మరలా? ప్రకృతి వ్యవసాయం బాగు

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026
శాసీ్త్రయత లేదు..
● వార్డుల విభజన అస్తవ్యస్తం ● ప్రజలు, పార్టీల అభిప్రాయం తెలుసుకోకుండానే జాబితా తయారు ● ఓ వర్గానికి మేలు చేసేలా ఉన్నాయన్న ఆరోపణలు

మంది ఉంటారని అంచనా వేశారు. ఆ మేరకు వార్డుల సంఖ్య 29 నుంచి 32కు పెంచారు. గతంలో 24వ వార్డును ప్రస్తుతం 25గా మార్చారు. ఇక్కడ బొబ్బిలివీధి, సతపతివీధి, ఎరుకల వీధి, రామాకాలనీ, ఘల్జిపేట, డబ్బివీధిలో ఒక భాగంతో మిళిత మై ఉండేవి. ఇందులో నుంచి సుమారు 500 ఓట్లు కలిగిన బొబ్బిలివీధి ప్రాంతాన్ని, 150 ఓట్లు ఉన్న ఘల్జిపేటను, 60 ఓట్లు ఉన్న డబ్బివీధిలో ఒక ప్రాంతాన్ని తొలగించారు. డబ్బివీధిలో ఒక భాగం మాత్రమే కొత్తగా ఏర్పడిన 29వ వార్డులోకి మార్చా రు. ఇందులో రాజకీయ కారణాలున్నాయని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ వార్డులో 1,350 ఓట్లు ఉండగా.. ఎన్నికల్లో 850 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇందులో దాదాపు 70 శాతం ఈ మూడు ప్రాంతాల నుంచే ఉన్నాయి. ప్రస్తుతం చేపట్టిన విభజనలో 710 ఓట్ల విస్తీర్ణం గల ప్రాంతాన్ని తొలగించారు. ఆ స్థానంలో ప్రత్యామ్నా య ప్రాంతాలను ఈ వార్డులో చేర్చలేదు. దీనివల్ల సమాన ఓటరు ప్రాతినిధ్యం, ఓట్ల సమతుల్యం దెబ్బతింటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో అత్యధికంగా పోలింగు నమోదైన ప్రాంతాలను వార్డు నుంచి తొలగించడం వల్ల భవిష్యత్తులో ఈ వార్డులో పోలింగు ఓట్లు 250 నుంచి 300కే పరిమితమయ్యే అవకాశం ఉంది.గతంలో 27వ వార్డు గా ఉన్న ఒక కూడలి ప్రాంతం నుంచి అధికార పా

సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు/పాలకొండ రూరల్‌: సాధారణంగా వార్డులు పునర్విభజన చేసేటప్పుడు జనాభా, ఓట్ల సమతుల్యం, భౌగోళిక ప్రాంతం, సామాజిక అనుబంధం, సమాన ప్రజాప్రతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం చేపట్టిన వార్డుల పునర్విభజనలో ప్రజాభిప్రాయం, రాజకీయ పార్టీల నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండానే అశాసీ్త్రయంగా చేపట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అభ్యంతరాలు కోరగా.. ప్రజలు, వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు కాగా.. పాలకొండ నగర పంచాయతీగా ఉంది. 2011 జనా భా ఆధారంగా, ప్రస్తుతం పెరుగుదలను అంచనా వేస్తూ, వార్డుల పునర్విభజన చేపట్టారు. ఆ మేరకు ప్రాథమిక నోటీఫికేషన్‌ జారీ చేశారు. భౌగోళికంగా దశాబ్దాల నుంచి ఒకే ప్రాంతంగా కలిపి ఉన్న వీధులను, కాలనీలను రెండు, మూడు వార్డులు చేసేశా రు. దీనివల్ల ప్రజల ఐక్యత దెబ్బతినడమే కాక.. భవిష్యత్తులో ఆయా వార్డుల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్న అభిప్రాయాన్ని పలు పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విభజన వల్ల ఒకే కుటుంబాని కి చెందిన ఓటర్లు వేర్వేరు వార్డుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఏర్పడింది. ఇది ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురి చేస్తుంది. ఏ వార్డు పరిధిలో ఏయే వీధులన్నాయో స్పష్టంగా పేర్కొనలేదు. ఏ వార్డులో ఎంతమంది ఓటర్లున్నారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాల ఓటర్ల వివరాలు కూడా లేకుండా అయోమయం సృష్టించారని పలు పార్టీల నాయకులు అంటున్నారు. చాలా వరకు అధికార పార్టీకి అనుకూలంగానే చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పార్వతీపురం పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 53,844 మంది ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 63 వేలకు చేరిందని అంచనా వేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న 30 వార్డులను 36కు పెంచారు. ఇక్కడ అనేక ఏళ్లుగా ఉన్న వీధులను.. ఒకే కుటంబానికి చెందిన ఓటర్లను రెండు, మూడు వార్డులుగా విభజించారు. ప్రస్తుతం ఉన్న రెల్లివీధిని నాలుగు వార్డులుగా చేశారు. మద్దాలవారివీధిని రెండు వార్డుల్లో.. జగన్నాథపురం ప్రాంతంలో గాసివీధిని రెండు వార్డులుగా, దుబగడ్డ వీధిని రెండుగా, రాయగడ రోడ్డు కొత్తవీధిని మూడుగా, అగ్రహారం వీధి ఉత్తర భాగాన్ని ఒక వార్డులో.. దక్షిణ భాగాన్ని మరో వార్డులో చేర్చారు. గతంలో 30వ వార్డు కింద ఉన్న ఎస్సీ వీధి, పిల్లావీధి, నాయుడువీధి, భేరివీధి, బూడివీధి, గీతా మందిరం రెండు వీధులను అశాసీ్త్రయంగా కొత్తగా ఒకటో వార్డులో చేర్చి విడదీశారు. 29వ వార్డులో ఉన్న కుసుమగుడ్డివారివీధిని కొంత మూడో వార్డులోకి, కొంత 36వ వార్డులోకి మార్చారు. భౌగోళికంగా ఈ ప్రాంతం చాలా దూరం. చాలా చోట్ల ఒక వీధి మూడు ముక్కలైపోయింది. ఓటు వేయడానికి కూడా ఓటరు సుదూర ప్రాంతం వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా విభజించడం వల్ల భవిష్యత్తులో ప్రజలకు అనేక సమస్యలు వస్తాయని సీపీఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు బీవీ రమణ చెబుతున్నారు. ముద్రించిన నోటుపై ఉన్న బౌండరీలు ముఖస్తంగా చూపించాలని కోరుతున్నారు.

సాలూరు మున్సిపాలిటీలో 2011లో 49,560 జనాభా ఉండగా.. ప్రస్తుతం సుమారు 59,248

పార్వతీపురం పట్టణం

భద్రగిరి ఆస్పత్రిలో మృతి చెందిన మండంగి లక్ష్మి

Advertisement
 
Advertisement
Advertisement